బిజీబిజీగా ప్రధాని విదేశీ షెడ్యూల్ : 65 గంటలు - 25 సమావేశాలు : యూరప్ దేశాల్లో..!!

ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ మొత్తం బిజీబిజీగా గడవనుంది. దాదాపు 65 గంటలపాటు వివిధ నేతలతో 25 సమావేశాల్లో పాల్గననున్నారు. వీరిలో ఎనిమిదిమంది ప్రపంచ నేతలు ఉన్నారు. వేలాదిమంది ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. డెన్మార్క్‌, జర్మనీలలో ఒక రాత్రి చొప్పున బస చేయనున్నారు.

Recommended Video

    PM Modi On Petrol, Diesel Tax తెలుగు రాష్ట్రాలపై ఆవేదన | Telugu Oneindia

    50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. 'జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌తో బెర్లిన్‌లో మోదీ భేటీ అవుతారు. భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. షోల్స్‌తో మోదీ భేటీ ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది' అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

    PM Modi will embark on a three-day visit to Germany, Denmark and France from May 2

    భారత్‌, జర్మనీ అంతర ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ (ఐజిసి) ఆరో సమావేశంలో ఇరువురు పాల్గంటారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్‌ నిర్వహిస్తున్న సదస్సులోనూ మోదీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానులతో ఆయన మాట్లాడనున్నారని వివరించారు. కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నవకల్పనలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీల్లో చర్చకు రానున్నాయని తెలిపారు.

    ఈ నెల 22 నుంచి దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో నూ ప్రధాని పాల్గొనున్నారు. వారం పాటు జరిగే దావోస్ సదస్సుకు ప్రధానితో పాటుగా జాతీయ స్థాయిలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు..అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇక, ప్రధాని యూరప్ దేశాల పర్యటన పైన ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+