వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగ్రాట్స్ ద్రౌపది ముర్ము: ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా శుభాకాంక్షలు

|
Google Oneindia TeluguNews

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను విష్ చేశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభినందనలు తెలియజేశారు. వీరిద్దరూ కలిసి.. ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముర్ము ఇంటికి వచ్చారు. ఆమెకు కలిసి కంగ్రాట్స్ తెలిపారు.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా విష్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ట్వీట్ చేశారు. ఇదీ ప్రజా విజయం అని తెలిపారు. ఒడిశాకు చెందిన ముర్ము.. రాష్ట్రపతిగా విజయం సాదించారు. ఇదీ తమ రాష్ట్రానికి దక్కిన గౌరవం అని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా గిరిజనుల ఆనందానికి అవది లేకుండా పోయింది. ద్రౌపది ముర్ము జర్నీ రాయ్ రంగ్‌పూర్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగింది. ఆమె గిరిజన మహిళ.. ఉన్నత శిఖరాలకు చేరుకుంది.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన బైదాపోసి గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. తాతలు పంజాయితీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో సచివాలయంలో క్లరికల్ పోస్ట్‌లో ముర్ము చేరారు. రాయంగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో పనిచేసే శ్యామ్ చరణ్ ముర్ముని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. అయితే ఇద్దరు కుమారులు చనిపోయారు. భర్త శ్యామ్ చరణ్ 2014లో మరణించారు.

రాజకీయాల్లోకి..

రాజకీయాల్లోకి..


తర్వాత ద్రౌపది ముర్ము రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాయ్‌రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ కి చెందిన గిరిజన తెగల మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2000వ జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి 6 నుండి 2002 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతలు నిర్వహించారు.

గవర్నర్ టు రాష్ట్రపతి

గవర్నర్ టు రాష్ట్రపతి


ద్రౌపది ముర్ము 2004 లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, 2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, 2010లో మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, 2013 నుంచి 2015 వరకు మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేశారు. ద్రౌపది ముర్ముకు 2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారాన్ని అందించింది. ద్రౌపది ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవీ అధిరోహించబోతున్నారు.

English summary
prime minister narendra modi wish to Droupadi Murmu for elected president of india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X