పదేళ్ల చిన్నారికి ‘థాంక్యూ’ చెప్పిన మోడీ
కాన్పూర్: దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరానికి చెందిన పదేళ్ల బాలిక అదితి ఒక లేఖ రాసింది.
అయితే తన లేఖకు ప్రధాని సమాధానం ఇస్తారని ఆమె ఊహించలేదు. కానీ, ప్రధాని తనకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన సానుకూల దృక్పథాన్ని అభినందిస్తూ లేఖ రాయడంతో ఆ చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
దేశం కోసం ప్రధాని ప్రారంభించిన పథకాలకు థ్యాంక్స్ చెప్పాను అని తెలిపింది.
ఆ పథకాలు ఎంతో మార్పును తెస్తున్నాయని చెప్పింది. కాగా, తనకు ఏప్రిల్ 11న ప్రధాని లేఖ అందిందని తెలిపింది. ఆ లేఖ చూసిన తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

ప్రధాని మంచి పనులు చేస్తున్నారని భావిస్తున్నావా? అన్న ప్రశ్నకు 'అవును' అంటూ సమాధానమిచ్చింది అదితి. ప్రధానికి లేఖలు రాయడాన్ని ఇకముందూ కొనసాగిస్తానని చిన్నారి చెబుతోంది.
కాగా, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను తన కుమార్తె ఇంత నిశితంగా పరిశీలిస్తున్న విషయం, ఆమె రచనా నైపుణ్యం గురించి తనకు తెలియదని అదితి తల్లి విస్మయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications