భారత్‌కు చైనా అధ్యక్షుడి రాక.. మహాబలిపురంలో ప్రధాని మోడీతో భేటీ
ఢిల్లీ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. మహాబలిపురం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వీరిద్దరు సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. చైనా అధ్యక్షుడి రాక నేపథ్యంలో సమావేశం జరిగే ప్రాంతంతో పాటు పరిసరాలు కొత్త శోభ సంతరించుకున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైంది. ఈ నెల 11, 12వ తేదీల్లో ఆయన ఇండియాకు రానున్నారు. తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం సందర్శించనున్నారు. ఆ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనతో అక్కడే భేటీ కానున్నారు. ఇరు దేశాధినేతల సమావేశానికి మహాబలిపురం వేదిక కావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడి రాక నేపథ్యంలో అక్కడి ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఇరువురి భేటీ కీలకంగా మారనుండటంతో ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. మహాబలిపురం పరిసర ప్రాంతాలు కొత్త హంగు సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక సమావేశాలు జరగనున్న ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ చారిత్రక వారసత్వ ప్రదేశాల్లో మహాబలిపురాన్ని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఇరువురి భేటీకి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానించారు మోడీ.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications