పాక్ గగనతలంలో ప్రధాని మోడీ విమానం-46నిమిషాల పాటు-గతంలో ఏం జరిగింది ?
ప్రధాని నరేంద్రమోడీ తన పోలాండ్ పర్యటన ముగించుకుని భారత్ కు వచ్చే క్రమంలో పాకిస్తాన్ మీదుగా చేరుకున్నారు. వాస్తవానికి ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇలా ప్రధాని మోడీ విమానం పాకిస్తాన్ గగనతలంపై నుంచి ప్రయాణించడంతో ఈ వ్యవహారం రెండు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. దీనిపై పాకిస్తాన్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

పోలాండ్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో ప్రధాని మోడీ విమానం పాకిస్తాన్ లోని చిత్రాల్ పై నుంచి గగనతల ఆంక్షలు ఉన్న ఇస్లామాబాద్, లాహోర్ పై నుంచి 46 నిమిషాల పాటు ప్రయాణించి ఢిల్లీకి చేరుకుంది. ఉదయం సరిగ్గా 10.115 నిమిషాలకు ప్రధాని మోడీ విమానం ఇలా పాకిస్తాన్ గగన తలంలోకి ప్రవేశించి 11.01కి దేశాన్ని వీడినట్లు స్దానిక మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే ప్రధాని మోడీ విమానం ఇలా ఏ దేశ గగనతలంపై నుంచి అయినా వెళ్లకుండా ఎలాంటి ఆంక్షలు లేవు. వాస్తవానికి ఇలా వీవీఐపీలు ప్రయాణించే విమానాలకు ఓ కాల్ సంకేతం ఇస్తారు. అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు, ప్రధాని ప్రయాణించే విమానాలకు కూడా ప్రత్యేక సంకేతం ఇస్తారు. దీంతో వారి ప్రయాణాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇలాగే ప్రధాని మోడీ విమానాన్ని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా కాల్ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 2019 ఫిబ్రవరి 26 తర్వాత పాకిస్తాన్ తమ గగన తలంపై నుంచి భారతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అంతే కాదు అప్పట్లో ప్రదాని మోడీ జర్మనీ పర్యటనకు పాకిస్తాన్ గగనతలం వాడుకుంటామని అడిగినా ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి ప్రధాని మోడీ పాకిస్తాన్ గగనతం మీదుగా ప్రయాణించడం లేదు. ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోడీ విమానం ప్రయాణించింది.












Click it and Unblock the Notifications