వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని జపాన్ టూర్, 4 రోజుల్లో 14 డ్రెస్‌లు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. జపాన్ లో పర్యటించిన ప్రధాని పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆసియా ఆర్దిక వ్యవస్దలో రెండు, మూడు స్దానాల్లో ఉన్న జపాన్ ఇండియా మధ్య భాగస్వామ్యం మరింత పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా మోడీ పర్యటన జరిగింది. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా జపాన్ వ్యాపారవేత్తలకు నరేంద్ర మోడీ ఆహ్వానం పలికారు.

మౌలిక సదుపాయాలు, స్మార్ట్‌ సిటీల రూపకల్పన, బుల్లెట్‌ రైళ్లు వంటి అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. జపాన్‌, భారత పౌర అణు ఒప్పందం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇక జపాన్‌లో నరేంద్ర మోడీ తన సహజసిద్ధ సంభాషణ శైలితో అక్కడి పౌరులను ఆకట్టుకోగలిగారు. మేడిన్‌ ఇండియా అంటూ జపనీస్‌ పెట్టుబడుదారులను భారత దేశానికి ఆహ్వానించారు.

100 స్మార్ట్ సిటీల ప్లాన్ త్వరలోనే సిద్దం

ఎన్‌డీఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినున్న 100 స్మార్ట్ సిటీల అభివృద్ద ప్రణాళిక త్వరలోనే తుది దశకు చేరుతుందని కేంద్ర బుధవారం వెల్లడించింది. స్మార్ట్ సిటీల అభివృద్దిలో ప్రైవేటు సెక్టార్ పాలుపంచుకోవచ్చని, అందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేస్తామన్నారు.

మోడీ జపాన్ పర్యటన: నాలుగు రోజుల్లో 14 డ్రెస్సులు

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన సందర్భంగా నాలుగు రోజులలో 14 జతల దుస్తులు మార్చారట. జపాన్ విమానం ఎక్కడానికి ముందు ఒక డ్రెస్, దిగాక మరో డ్రస్, జపాన్ ప్రధానితో ఉన్నప్పుడు ఒక డ్రెస్, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయినప్పుడు ఇంకో డ్రెస్, డ్రమ్స్ వాయించినప్పుడు వేరొక డ్రెస్ ఇలా 14 జతల దుస్తులను మోడీ మార్చారట. వాటితోపాటు బూట్లు, టై, బ్లేజర్‌లు వంటివి కూడా మారిపోయాయి. ప్రధాని అయ్యాక కొత్త గెటప్‌లలో మోడీ కనిపిస్తున్నారు.

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని స్వదేశానికి తిరిగివచ్చారు. ఎయిర్ పోర్ట్‌లో అభివాదం చేస్తున్న మోడీ.

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని స్వదేశానికి తిరిగివచ్చారు. ఎయిర్ పోర్ట్‌లో నమస్కారం చేస్తున్న మోడీ.

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని స్వదేశానికి తిరిగివచ్చారు. ఎయిర్ పోర్ట్‌లో అభివాదం చేస్తున్న మోడీ.

 జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటన ముగించుకోని ఢిల్లీకి చేరుకున్న మోడీ

జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని స్వదేశానికి తిరిగివచ్చిన మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday returned home after concluding his successful visit to Japan, which promised to give USD 35 billion to India over the next five years for developmental projects, as the two sides agreed to enhance their strategic cooperation to a new level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X