వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఝలక్:మూడు మాసాల నివేదికలివ్వండి, పనితీరును అంచనాకేనా?

మూడుమాసాల పర్యటనల వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్రమంత్రులను ఆదేశించారు.ఈ నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరును ప్రధాని అంచనావేయనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:గత మూడు మాసాలుగా కేంద్రమంత్రులంతా ఎక్కడ పర్యటించారో వివరాలివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించారు.ఈ పర్యటనల నివేదికలను సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు అప్పగించారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మంత్రులు ప్రచారం చేశారా లేదా అనే విషయాలను తెలుసుకొనేందుకుగాను ఆయన ఈ వివరాలను అడిగారు.

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరం మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.మోడీ ప్రభుత్వంపై పెద్ద నగదునోట్లు రద్దు చేయడం సమస్యలను తెచ్చిపెట్టింది.

కొత్త కరెన్సీ అందుబాటులో లేని కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.పెద్ద నగదు నోట్ల రద్దుపై విపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా దుమ్మెత్తిపోశాయి. ఈ పరిస్థితుల్లో మంత్రుల పనితీరును అంచనావేసేందుకుగాను మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

 మూడు మాసాల టూర్ల నివేదికలు ఇవ్వండి

మూడు మాసాల టూర్ల నివేదికలు ఇవ్వండి

గత మూడు మాసాలకు చెందిన కేంద్ర మంత్రుల పర్యటనల నివేదికలను ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్రమంత్రులను ఆదేశించారు.పెద్ద నగదు నోట్ల రద్దుపై ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను మంత్రులు ఏ మేరకు తిప్పికొట్టారనే విషయమై అంచనా వేసేందుకుగాను మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు వివరించారు.

పట్టణాభివృద్ది శాఖ మంత్రికి నివేదికలివ్వాలి

పట్టణాభివృద్ది శాఖ మంత్రికి నివేదికలివ్వాలి

మూడు మాసాల కేంద్ర మంత్రుల పర్యటనల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు ఇవ్వాల్సిందిగా ప్రధాని మంత్రులకు సూచించారు.దేశ వ్యాప్తంగా పర్యటనలు చేయకపోతే ఢిల్లీలోని మంత్రిత్వశాఖల కార్యాలయాలకు వెళ్ళారా లేదా చెప్పాలని కూడ ప్రధాని ఆదేశించారు.

ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయి

ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయి

క్షేత్రస్థాయిలో ప్రజలతో మంత్రులకు సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై కూడ ప్రధానమంత్రి ఆరా తీస్తున్నారు.పెద్ద నగదు నోట్ల రద్దు పై నియోజకవర్గ స్థాయిల్లో మంత్రులు ప్రచారం చేశారా లేదా అనే విషయాలపై ప్రధాని ఆరా తీస్తున్నారు.ఆఫీసు పని, క్షేత్రస్థాయిలో నిధుల మద్య సమన్వయం ఎలా చేసుకొంటున్నారనే విషయాలపై కూడ ఆయన ఆరా తీస్తున్నారు.

మంత్రుల పనితీరుపై అంచనా

మంత్రుల పనితీరుపై అంచనా

కేంద్ర మంత్రుల పనితీరును అంచనావేసేందుకుగాను ప్రధానమంత్రి మోడీ ఈ మేరకు మూడు మాసాల పర్యటనల నివేదికలను అడిగారు.ఈ నివేదికల ఆదారంగా మంత్రుల పనితీరును ఆయన అంచనావేసే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును అంచనావేసి భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు.పలు అంశాలను ఆయన ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా మంత్రులను ఆదేశించారు.

English summary
prime minister naredndra modi has asked ministerial colleagues to give details of tours, if any undertaken by them during the last 3 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X