బాత్రూంలు మీరు కట్టిస్తే..: రాహుల్‌పై మోడీ చురకలు

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు సభలో చురకలు అంటించారు. కొందరికి వయసు పెరుగుతుంది కాని బుర్ర పెరగదని పరోక్షంగా అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎగతాళి చేయడం కన్నా వాటిని విజయవంతం చేయడం కోసం నిర్మాణాత్మక సలహాలిస్తే బాగుంటుందన్నారు.

ప్రధాని మోడీ మాట్లాడుతుండగా... రాహుల్ గాంధీ వెళ్లబోయారు. ఈ సమయంలో ప్రధాని మోడీ.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లోకసభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా చెప్పడంతో రాహుల్ తిరిగి వచ్చి కూర్చున్నారు.

PM Narendra Modi Attacks Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రధాని మోడీ తనదైన శైలిలో వాగ్భాణాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ తమ కోసం చాలా వదిలేసిందన్నారు. వారు టాయిలెట్లు కట్టి ఉంటే మాకు ఆ పని తప్పేదన్నారు. వారు అందరికీ కరెంట్ ఇవ్వకుండా.. తమకు వేలాది ఇళ్లకు విద్యుత్ ఇచ్చే పనిని అప్పగించారన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి నిజంగా తోడ్పడి ఉంటే దేశంలో పేదల పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదన్నారు. దేశం బలహీనంగా ఉన్నట్లు చూపించడం సరికాదని స్వర్గీయ ఇందిరా గాంధీ అన్నారని మోడీ గుర్తు చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యకషుడితో సమావేశమైన వేళ కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్సును బహిరంగ సభలో చించినది ఎవరో తెలుసునని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+