బైడెన్‌తో మోదీ ఫేస్ టు ఫేస్

PM Modi US visit 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంటుంది.

PM Narendra Modi departs for US for 3 day visit including UN General Assembly

ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో ముఖాముఖి హాజరు కానున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌ అంశంపై ప్రసంగిస్తారు.

క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఆ దేశ కాలమానం ప్రకారం 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్‌ ఈ ఏడాది విల్మింగ్టన్‌లో ఏర్పాటు కాబోతోండటం ఇదే తొలిసారి.

క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్‌, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్టమొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ భేటీ ఏర్పాటవుతూ వచ్చింది.

సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చిస్తారు.

దీని తరువాత న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు మోదీ. 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది ఐరాస. 1945 అక్టోబర్ 25వ తేదీన ఐరాస ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహించబోతోంది. సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ థీమ్‌తో ఈ ఏడాది సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+