ఒకే రోజు పట్టాలెక్కిన 5 వందేభారత్ రైళ్లు: జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ, ఈ రాష్ట్రాల్లోనే
భోపాల్: దేశంలో అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్ల(Vande Bharat Express) ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు ఐదు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జెండా ఊపి వీటిని ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోడీ.. భోపాల్(రాణి కమలాపతి)-జబల్‌పూర్, ఖజురహో-భోపాల్-ఇండోర్, హతియా-పాట్నా, దార్వాడ్-బెంగళూరు, గోవా(మాడ్గావ్)-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగానూ, మిగితా మూడు రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వందేభారత్ రైల్లో పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాధిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మంగళవారం ఉదయం భోపాల్ ఎయిర్‌పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు ప్రధాని హెలికాప్టర్‌లో రావాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకున్నారు.
PM Sri @narendramodi Ji flagged off Karnataka's 2nd #VandeBharatExpress today.
— Tejasvi Surya (@Tejasvi_Surya) June 27, 2023
While the 1st Mysuru-Bengaluru-Chennai route connected Tech & Startup hub Bengaluru with culturally rich Mysuru & industrial hub Chennai, the 2nd VB express connects Bengaluru with education hub of… pic.twitter.com/UO6kDwxfAn
'ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్‌లలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి' అని ప్రధాని మోడీ సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఒకేసారి రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది.
మరోవైపు, ప్రధానమంత్రి ఈరోజు దాదాపు 10 లక్షల మంది బూత్ స్థాయి బిజెపి కార్యకర్తలతో కూడా సంభాషించనున్నారు. "మేరా బూత్ సబ్సే మజ్‌బూత్" ప్రచారంలో తమ బూత్‌లను బలోపేతం చేయడంలో సమర్థవంతమైన కృషి చేసిన దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 3,000 మంది పార్టీ కార్యకర్తలతో ప్రధాని సంభాషిస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications