వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయిని కలిసిన ప్రధాని మోడీ, శుభాకాంక్షలు తెలిపిన బాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయిని ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోడీ కలిశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురవారం నాడు వాజ్‌పేయి తన 90వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయిని కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాజ్‌పేయి పుట్టిన రోజుని సుపరిపాలనా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం పెద్ద నివాళి అని ప్రధాని మోడీ అన్నారు.

PM Narendra Modi greets Atal Bihari Vajpayee on his birthday

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి పుట్టినరోజు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. 1998- 2004 మధ్య దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెస్సేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మహోన్నత వ్యక్తిత్వంతో దేశ రాజకీయాల్లో ఆయన అజాత శత్రువన్న పేరు సంపాదించుకున్నారు.

భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి కూడా అటల్ జీ మాత్రమే కావడం విశేషం. వాజ్‌పేయి పుట్టినరోజుని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని డిసెబంర్ 2న ప్రధాని మోడీ ప్రకటించారు.

ఇక ప్రస్తుతం మాజీ ప్రధాని వాజ్‌పేయి తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. దాదాపు ఐదేళ్లుగా వాజ్‌పేయి అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ప్రధానిగా ఉండగానే మధ్యమధ్యలో మతిమరుపుతో ఏవో ఆలోచనల్లోకి వెళ్లేవారు.

వాజ్‌పేయి ప్రస్తుతం మంచం మీద నుంచి లేవగలిగే స్థితిలో లేరు. ఎవరైనా సందర్శకులు వస్తే... యంత్రాల సహాయంతో మంచాన్ని ఆయన కూర్చునే స్థితిలోకి మారుస్తున్నారు. ఇటీవల అద్వానీ అక్కడికి వెళ్లి వాజపేయిని కదిలించే ప్రయత్నం చేశారు.

‘అటల్‌జీ అద్వానీ వచ్చారు' అని చాలాసేపు చెప్పిన మీదట వాజ్‌పేయి క్షణంపాటు కళ్లు తెరిచి, మళ్లీ మూసుకుని నిద్రావస్థలో జారిపోయారు. మంగళవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సందర్శించినప్పుడూ వాజపేయి అలాగే కనిపించారు. వాజపేయితో పాటు ఆయన పెంపుడు కూతురు నమిత, అల్లుడు రంజన్‌ భట్టాచార్య మాత్రమే ఆయన పక్కన ఉండి సపర్యలు చేస్తున్నారు.


వాజ్‌పేయి తన జీవితంలో సాధించిన అరుదైన ఘట్టాలు

1951: జనసంఘ్‌ సంస్థాపక సభ్యుడు
1957: తొలిసారి లోక్‌సభకు ఎంపిక
1962: రాజ్యసభ సభకు ఎంపిక
1967: లోక్‌సభకు రెండోసారి ఎన్నిక
1968: జనసంఘ్‌ అధ్యక్షుడిగా..
1971: లోక్‌సభకుమూడోసారి ఎన్నిక
1977: లోక్‌సభకు నాల్గవసారి ఎన్నిక
1977: కేంద్ర విదేశాంగమంత్రి
1977: జనతాపార్టీ వ్యవస్థాపక సభ్యుడు
1980: లోక్‌సభకు 5వసారి ఎన్నిక
1980: బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు
1986: రాజ్యసభకు ఎంపిక.
1991: లోక్‌సభకు ఆరోసారి ఎన్నిక
1994: ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు
1996: లోక్‌సభకు 7వసారి ఎన్నిక
1996: ప్రధానిగా తొలిసారిప్రమాణం
96-97: లోక్‌సభలో ప్రతిపక్ష నేత
1998: ప్రధానిగా రెండోసారి ప్రమాణం
1999: 9వ సారి లోక్‌సభకు..ప్రధానిగా మూడోసారి ప్రమాణం
2004: లోక్‌సభకు
తిరిగిఎంపిక (10వసారి)
2005: రాజకీయాలకు స్వస్తి

English summary
Prime Minister Narendra Modi on Thursday greeted former prime minister Atal Bihari Vajpayee on his 90th birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X