Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayaan-3: దేశానికి దూరంగా ఉన్నా.. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు

బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంలో పాల్గొన్న బారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ అనే నినదాన్ని ఇచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అవడం గర్వంగా ఉందని చెప్పారు.

PM Narendra Modi Hails ISRO Scientists With Jai Vigyan Jai Anusandhan Slogan In Bengaluru

నేను దేశం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. నా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాను. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఎప్పుడెప్పుడు భారత్ వస్తానా.. ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాను.. అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాను అని ప్రధాని మోడీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్లను కలిసేందుకు అక్కడ్నుంచి బయల్దేరారు.

కాగా, చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు.

శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)ను మోడీ సందర్శిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. "ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే బెంగళూరు చేరుకుంటారు" అని పేర్కొంది.

చంద్రయాన్-3 మిషన్‌లో కనుగొన్న విషయాలు, పురోగతి గురించి నరేంద్ర మోడీకి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించనున్నారు. బెంగళూరులో దిగిన తర్వాత, మోడీ ట్విట్టర్ వేదికగా.. "చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వపడేలా చేసిన మా అసాధారణమైన ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాము. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాల వెనుక వారి అంకితభావం, అభిరుచి నిజంగా చోదక శక్తులు అని పేర్కొన్నారు.

బెంగుళూరులోని ISTRAC వెలుపల పోలీసులు, ఇస్రో అధికారులు గుమిగూడినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ మోడీ శాస్త్రవేత్తలను కలవనున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ల రెండు దేశాల పర్యటన తర్వాత ప్రధానికి స్వాగతం పలికేందుకు బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

మరోవైపు, మోడీకి ఘన స్వాగతం పలికేందుకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వెలుపల అనేక మంది ప్రజలు గుమిగూడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మోడీకి రెండు ప్రదేశాలలో స్వాగతం పలుకుతారని బీజేపీ నేతలు చెప్పారు. HAL విమానాశ్రయం వెలుపల, ISTRACకి దగ్గరగా ఉన్న జలహళ్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున ప్రజలు గుమిగూడారు. అయితే, ఎలాంటి రోడ్‌షో ఉండదని స్పష్టం చేశారు.

'ఇది మాకు గర్వకారణమైన క్షణం ఎందుకంటే ఇది చాలా పెద్ద విజయం. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ఇస్రో బృందంలోని శాస్త్రవేత్తలను కలవడానికి ప్రధాని మోడీ బెంగళూరుకు వస్తున్నందుకు మేము ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడకు వచ్చాము' అని స్థానికులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మోడీకి స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. 15వ బ్రిక్స్ సమ్మిట్‌కు హాజరైన సమయంలో జోహన్నెస్‌బర్గ్ నుంచి ల్యాండర్ విక్రమ్ చారిత్రాత్మక టచ్‌డౌన్ ప్రత్యక్ష ప్రసారాన్ని మోడీ వీక్షించారు.

ఇస్రో కేంద్రానికి దారితీసే రోడ్ల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ ఇప్పటికే విడుదల చేశారు. ఉత్తర బెంగళూరు రోడ్లపై ఆంక్షలు విధించారు. అయితే, తూర్పు, మధ్య బెంగళూరు రోడ్లపై ఉదయం 6:30 నుంచి 9:30 వరకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లేదారిలో ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు.

PM Narendra Modi Hails ISRO Scientists With Jai Vigyan Jai Anusandhan Slogan In Bengaluru

బుధవారం సాయంత్రం చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారతదేశంపై ప్రపంచ దేశాలు ప్రశంసలుకురిపించాయి. చారిత్రాత్మక ఘనతను సాధించిన మొదటి దేశంగా నిలిచింది భారత్. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్‌పై నిరాశకు ముగింపు పలికింది.

చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన అమెరికా, చైనా, రష్యాల తర్వాత భారత్ నాలుగో దేశంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను ప్రయోగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+