మైనారీటీ విద్యార్థులకు 5 కోట్ల స్కాలర్‌షిప్స్... మంత్రి నఖ్వీ...
దేశంలో పెరుగుతున్న మతతత్వాన్ని తగ్గుముఖం పట్టించేందుకు మోడీ అనేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఈనేపథ్యంలోనే మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రానున్న అయిదు సంవత్సరాల్లో మైనారీటీ విద్యార్థులకు అయిదు కోట్ల స్కాలర్‌షిప్‌లను అందించనుందని ఆయన ప్రకటించారు. కాగా వీటిలో యాబై శాతం మందికి వీటిని అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక వీటిని ప్రీ మెట్రిక్ నుండి పోస్ట్ మెట్రిక్ తోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సులు చదువు కుంటున్న విద్యార్థులకు అందిస్తామని ఆయన ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా మైనారీటీల అభివృద్ది..
ఢిల్లీలోని మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 65వ జనరల్ బాడీ సమావేశంలో పాల్గోన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఆరోగ్యకరమైన అభివృద్దిని సాధిందుకు ప్రధాన మంత్రి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. దీంతోపాటు పెరుగుతున్న మతతత్వ వ్యాధిని కూడ తోలగించేందుకు రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

మదర్సా టీచర్లకు ఆధునిక సబ్జెక్ట్స్ పై శిక్షణ
మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న మదర్సాల్లోని విద్యను అందిస్తున్న మదర్సా టీచర్స్‌కు విద్యార్థులకు ఇంగ్లీష్, మాథ్స్, హిందితోపాటు కంప్యూటర్ బాషను భోదించేందుకు వీలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.దీని వల్ల మదర్సాలలో చదువుకునే విద్యార్థులు మెయిన్ స్ట్ర్ర్రీమ్ విద్యావిధానంలోకి అడుగుపెడతారని తెలిపారు. దీని వల్ల మదర్సా విద్యార్థులు కూడ దేశ అభివృద్దిలో పాలుపంచుకునే అవకాశం కల్గుతుందని అన్నారు.ఇక ఈ కార్యక్రమాన్ని రానున్న నెలలోనే ప్రారంభిస్తామని అన్నారు.

మైనారీటీ విద్యార్థులకు ఉపాధిలో శిక్షణ
మరోవైపు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులతోపాటు మైనారీటీల పిల్లలను చదువుకు దగ్గర చేసేందుకు దేశవ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రామాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తామని అన్నారు. మరోవైపు మైనారీటీలకు వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వారిక ప్రత్యేక కోచింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక సదుపాయలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications