సోషల్ సైట్లలో మోడీ హల్‌చల్, ప్రపంచంలోనే తొలిసారి..
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్ వెబ్ సైట్లలో ఆయన హల్‌చల్ సృష్టిస్తున్నారు. ట్విట్టర్‌లో 80 లక్షల మంది ఫాలోయర్లతో మోడీ ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్నారు.
ఇప్పుడు ఫేస్‌బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండో స్థానానికి ఎగబాకారు. ఫేస్‌బుక్‌లో ప్రజాదరణ పరంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 4.3 కోట్ల మందితో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఓ ప్రకటన చేసింది. అటు ట్విట్టర్లో మోడీ కంటే ముందు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌లు ఉన్నారు.

మోడీ కేవలం ఐదు నెలల కారంలో కొత్తగా సుమారు 70 లక్షల మంది అభిమానులను ఫేస్‌బుక్‌లో సంపాదించుకున్నారు. జూలై నెలలో మోడీకి ఫేస్‌బుక్‌లో 1.85 కోట్ల మందికి పైగా అభిమానులు, ట్విట్టర్‌లో 50.9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మేలో ప్రధానిగా అయ్యాక అప్పటి వరకు ఉన్న ఫాలోయర్లకు కొత్తగా 40 లక్షల మందికి పైగా తోడయ్యారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో.. పర్యటనలో ట్విట్టర్ మిర్రర్ అనే టూల్‌ను ఉపయోగించిన తొలి ప్రధానిగా కూడా మోడీ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన దీనిని ఉపయోగించారు.
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ లేదా మోడీ విజయం, ప్రభుత్వ పథకాలతో ప్రజలను మమేకం చేయడం తదితర వాటిల్లో సోషల్ మీడియాను వారధిగా ఉపయోగించుకుని ఆయన సఫలీకృతులయ్యారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను వేదికగా చేసుకుని ప్రధాని సాగిస్తున్న హైటెక్ పాలన ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications