వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోకాళ్లపై వంగి క్షమించమని అడిగిన నరేంద్రమోడీ

|
Google Oneindia TeluguNews

రాజ‌స్థాన్‌లో జ‌రిగిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆల‌స్యంగా వ‌చ్చారు. ఈ కార‌ణంగా ప్ర‌సంగించ‌లేక‌పోతున్నందుకు ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ఆయ‌న మైక్ తీసి ప‌క్క‌న పెట్టారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వహ‌రించిన తీరుపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో న‌రేంద్ర‌మోడీ ప్రసంగించాల్సి ఉంది. తాను ప్ర‌సంగించాల్సిన సమయానికి కంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ''తాను ఇక్క‌డ‌కు రావ‌డం ఆల‌స్య‌మైంద‌ని, రాత్రి ప‌దిగంట‌ల‌వుతోంద‌ని, నిబంధ‌న‌లు పాటించాలంటూ నా మ‌న‌స్సాక్షి చెబుతోంద‌న్నారు''. ''త‌న‌ను ప్ర‌జ‌లు క్ష‌మించాల‌ని, మీ ప్రేమాభిమానాల కోసం మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌స్తానంటూ'' మాటిచ్చారు. స‌భ నుంచి వెళ్లేముందు 'భారత్‌ మాతాకీ జై' అని నినదించ‌డంతోపాటు మోకాళ్ల మీద వంగి సభికులంద‌రికీ న‌మ‌స్కరించారు.

pm narendra modi rajasthan tour

బీజేపీ నేత మాలవీయ ట్విట‌ర్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. స‌మ‌యం దాటడంతో బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడ‌కూడ‌ద‌ని, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మోడీ నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే అది ఏడో కార్య‌క్ర‌మ‌మ‌ని, మోడీకి 72 సంవ‌త్స‌రాల వ‌య‌సు అనే విష‌యాన్ని కూడా మ‌నం గుర్తుంచుకోవాల‌న్నారు. అంతే కాకుండా న‌వ‌రాత్రి ఉప‌వాసం చేస్తున్నార‌ని మాల‌వీయ తెలిపారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో పర్యటించి రాజస్థాన్‌కు వచ్చారు. గుజరాత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ రాజస్థాన్‌లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Prime Minister Narendra Modi came late to the BJP open meeting held in Rajasthan.He publicly apologized to the people for not being able to speak because of this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X