ర్యాలీ రద్దు, ప్రధాని మోడీ మాస్టర్ మైండ్: దేశంలోనే తొలి సారి సముద్ర విమానంలో!
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల రెండోదశ ప్రచారం మంగళవారంతో ముగియనుంది. మంగళవారం అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి భద్రతా కారాణాల దృష్ట్యా స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు.

సముద్ర విమానం
పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా వినూత్నంగా గుజరాత్ ప్రజల ముందుకు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి నదిలో సముద్ర విమానం (సీప్లేన్ )లో ప్రయాణించి ధారోయ్ డ్యామ్‌కు చేరుకుంటారు.

ఆలయంలో!
ధారోయ్ డ్యామ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించి అంబాజి చేరుకుంటారు. తరువాత అంబాజీలోని అంబా మాత ఆలయాన్ని దర్శించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు.

దేశంలోనే తొలిసారి
దేశంలో సీప్లేన్ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశంలో అన్ని చోట్లా సాధ్యం కాదు
దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులు నిర్మించడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
అందుకే వాటర్ వేస్ మీద తాము దృష్టి పెట్టామని, దేశంలోని అనేక ప్రాంతాల్లో వాటర్ వేస్ నిర్మించాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.

కాంగ్రెస్ మౌనం, బీజేపీ!
ప్రధాని నరేంద్ర మోడీ సముద్ర విమానం ప్రయాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌనంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త ప్రచార ప్రయోగం ఎంత వరకు మేలు చేస్తుందో అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందోళన చెందుతున్నారు. బీజేపీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications