కోవిన్ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు: అందుకేనా?
కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి జారీ చేసే కోవిన్ సర్టిఫికేట్లపై ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను తొలగించారని ది హిందూ తన కథనంలో పేర్కొంది. అంతకుముందు ఈ కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ ఫొటో ఉండేది. మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కోవిడ్ 19ని ఓడించగలుగుతాం అని ప్రధాని మోడీ పేరుతో సర్టిఫికేట్లు ఉండేవి.
అయితే, ప్రస్తుతం కోవిన్ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగించారని వార్తలు వచ్చాయి. పలువురు సోషల్ మీడియాలో ఈ మేరకు పలు పోస్టులు పెట్టారు. ప్రధాని మోడీ ఫొటో సర్టిఫికేట్లపై రావడం లేదని, కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే వస్తుందని కొందరు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల నుంచి ప్రధాని మోడీ ఫొటోలను తొలగించడం సాధారణమే. గతంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సమయంలోనూ ప్రధాని మోడీ ఫొటోను కోవిన్ పోర్టల్ లో తొలగించడం గమనార్హం.

అయితే, ఆస్ట్రాజెనికా తన కోవిడ్ వ్యాక్సిన్లతో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్న తర్వాతి రోజు ఇది జరగడంతో చర్చనీయాంశంగా మారింది. పలువురు ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతోనే ఇతర ప్రభుత్వ వెబ్ సైట్లలో మోడీ ఫొటో తొలగించిన మాదిరిగానే కోవిన్ పోర్టల్‌లోనూ మోడీ ఫొటోను అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది.
మా కోవిడ్ వ్యాక్సిన్స్‌తో అరుదైన సైడ్‌ఎఫెక్ట్స్: ఆస్ట్రాజెనికా
దిగ్గజ ఫార్మాసూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా సంచలన ప్రకటన చేసింది. తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) అనే దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది. కాగా, థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్ లెట్స్ కౌంట్‌కి కారణహమవుతుంది.
తీవ్రమైన గాయాలు, మరణాలకు టీకా కారణమవుతుందని ఆరోపణలతో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్న సతరుణంలో ఆస్ట్రాజెనికా ఈ ప్రకటన చేయడం గమనార్హం. తొలిసారిగా ఆస్ట్రాజెనికా కోవిడ్ 19 వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు దారితీస్తుందని కోర్టులో అంగీకరించింది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా కంపెనీ.. కోవిషీల్డ్, వాక్స్‌జెవ్రీయా బ్రాండ్ల పేర్లతో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సిన్లను విక్రయించిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టస్ వినాశకరమైన ప్రభావాలు కలిగి ఉన్నాయని అనేక కుటుంబాలు కోర్టును ఆశ్రయించి ఫిర్యాదులు చేశాయి.
కాగా, ఏప్రీల్ 2021లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను తీసుకున్న తర్వాత పర్మినెంట్ బ్రెయిన్ ఇంజూరీతో బాధపడుతున్న జామీ స్కాట్ ఈ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. ఇతని కేసులో రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్ లక్షణాలు కలిగిన థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే అరుదైన సైడ్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావాన్ని గుర్తించారు.
యూకే హైకోర్టుకు సమర్పించిన సైడ్ ఎఫెక్ట్ పత్రాల్లో ఆస్ట్రాజెనికా టీకా చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్ కి కారణం కావచ్చని అంగీకరించింది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ వ్యాక్సిన్ ఇకపై బ్రిటన్‌లో మనుగడ సాగించలేదు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications