నివేదిక ఇవ్వండి, పంజాబ్ సర్కార్‌కు హోంశాఖ ఆదేశం, సారీ చెప్పాలంటోన్న అమిత్ షా
పంజాబ్ పర్యటనలో మోడీకి పరాభావం ఇష్యూ దుమారం రేపుతుంది. దీనిపై బీజేపీ- కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఫ్లై ఓమర్ మీద ప్రధాని 20 నిమిషాలు ఆగడాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
Recommended Video
పంజాబ్‌లో ప్రధానికి భద్రతా లోపంపై నివేదిక కోరామని అమిత్ షా తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం తప్పిదం ఉందని కామెంట్ చేశారు. భద్రతా లోపానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ ఆలోచనా విధానం అలానే ఉందని.. మారలేదని చెప్పారు. దీనిని బట్టి మరోసారి రుజువు అయ్యిందని చెప్పారు.

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. రైతు నేతలు, శ్రేణుల నుంచి అనూహ్యంగా నిరసన ఎదురైంది. కానీ వాస్తవానికి ప్రధాని పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి నాగేశ్వరరావు నిన్ననే తెలిపారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని చెప్పారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్మీ మరియు బిఎస్‌ఎఫ్‌తో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపినా.. హై టెన్షన్ నేపథ్యంలో అక్కడికి మోడీ వెళ్లలేకపోయారు.












Click it and Unblock the Notifications