నాడు పాదపూజలు ఎందుకు, ఇద్దరి చరిత్ర తెలియని వారెందరో, పీఠం కోసమేనా?

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఇద్దరూ ఇద్దరేనని పిఎంకె వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆరోపించారు.

చెన్నై:తమిళనాడు రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం , అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఇద్దరూ ఒక్క తాను ముక్కలేనని పిఎంకె వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆరోపించారు.అన్నాడిఎంకె పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం కారణంగా రాష్ట్రంలో పాలన పూర్తిగా స్థంబించిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదలచేశారు. అధికార పోటీ రసవత్తరంగా సాగుతోందన్నారు. నిన్నటివరకు చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టి పాదపూజలు చేసిన నేత కంటికి ప్రస్తుతం అదే మహిళ దోపిడి దారుగా ఎలా కన్పిస్తోందని ఆయన ప్రశ్నించారు.

PMK leader Ramdas allegations on sasikala and panneerselvam

అధికారం కోసం పోటీపడుతున్న ఇద్దరి నేతల గత చరిత్ర తెలియని కార్యకర్తలు అనేక మంది ఉన్నారని, ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక మంది మంచి నేతలు ఉన్నారనే విషయాన్ని ఓటర్లు గ్రహించకపోవడం తనను ఆవేదనకు గురి చేస్తోందన్నారాయన.

శశికళను, పన్నీర్ సెల్వాన్ని త్రాసులో కూర్చోబెట్టి తూకం వేస్తే ఇద్దరు సమానంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో ఎవరు మంచివారో చెడ్డవారో బేరీజు వేయడం కంటే, వారి సిద్దాంతాలు, నైజాన్ని పోల్చుకొని ఒక అంచనాకు రావాలని ఆయన ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+