పిఎన్‌బి స్కాం: సీబీఐ అదుపులో గీతాంజలి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు గీతాంజలి గ్రూప్‌లో బ్యాంకిగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చితాలియాను అదుపులోకి తీసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసానికి సంబంధించి అతడిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు రూ.12,700 కోట్ల భారీ మోసంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో పాటు అతడి మామ గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ ఛోక్సీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

వీరిద్దరు అంతకుముందే దేశం విడిచి వెళ్లారు. దీనిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఉన్నత స్థానాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.












Click it and Unblock the Notifications