పిఎన్బీ స్కామ్: తెర మీదికి మరో ఇద్దరు బాలీవుడ్ తారలు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వార్తల్లోకి మరో ఇద్దరు బాలీవుడ్ తారలు ఎక్కారు. బాలీవుడ తారలు కంగనా రనౌత్, బిపాసా బసు ఇందుకు సంబధించిన వార్తల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా పేరు మాత్రమే నానుతూ వచ్చింది.
పిన్బీకి చెందిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుు నీరవ్ మోడీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మోహుల్ చోక్సీ తమకు బాకీలు చెల్లించాల్సి ఉందని వారు అంటున్నారు.

గీతాంజలి జెమ్స్‌పై కంగనా
గీతాంజలి జెమ్స్ కంపెనీ చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన రెమ్యునరేషన్ చెల్లించలేదని, పెద్ద మొత్తంలో బాకీ పడిందని కంగనా రనౌత్ ఆరోపించారు. గీతాంజలి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంగనా ఒప్పందం మేరకు పూర్తి సొమ్మును సంస్థ తనకు చెల్లించలేదని ఆరోపించినట్లు జాతీయ మీడయాలో వార్తలు వచ్చాయి.
Recommended Video


నా బాకీలు చెల్లించలేదు
తనకు 2016 నుంచి బాకీలు చెల్లించలేదని కంగనా రనౌత్ ఆరోపించారు. ఆమె కన్నా ముందు ఆ సంస్థకు ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహరించారు.

కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత సైతం
గీతాంజలికే చెందిన మరో బ్రాండ్ గిలికి అంబాసిడర్‌గా వ్యవహరించిన బిపాసా బసు కూడా మెహుల్ చోక్సీపై ఆరోపణలు చేశారు. 2008లో కాంట్రాక్టు ముగిసిన తర్వాత కూడా తన ఫొటోను వార్తాపత్రికల్లో వాడుకున్నారని ఆమె ఆరోపించారు

నష్టపోయానని బిపాసా
ఈ విషయంపై తాను మేనేజర్ కంపెనీని సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. దానివల్ల జ్యుయల్లరీ ఎండార్స్‌మెంట్లను తాను కోల్పోయానని చెప్పారు. ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాంట్రాక్టు రద్దుకు ప్రియాంక చోప్రా
నిరుడు ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రియాంక చోప్రా నీరవ్ మోడీకి చెందిన డైమండ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ప్రియాంకతో పాటు ప్రకటనల్లో కనిపించిన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కంపెనీతో కాంట్రాక్టు నిరుడే ముగిసినట్లు చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications