భార్య బీపీవోలో ఉద్యోగి: కిడ్నాప్ సినిమాలు చూసి భర్త పెడదారి

బెంగళూరు: భార్య సంపాదనతో జల్సాలు చేస్తూ ఒక్కసారిగా రూ.లక్షాధికారి కావాలని యత్నించిన యువకుడు చివరికి జైలు పాలైన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని యలహంక ఉపనగరలో నివాసం ఉంటున్న మహమ్మద్ వాసీం అలియాస్ కరణ్ (28) అనే యువకుడిని అరెస్టు చేశారు. ఇతను ఐటీఐ పూర్తి చేసి ప్రయివేటు కంపెనీలో ఉద్యగోం చేసేవాడు. అదే కంపెనీలో బీపీఓగా ఉద్యోగం చేస్తున్న విద్యావంతురాలైన హిందూ యువతిని మహమ్మద్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం అతను హిందూ సాంప్రదాయం ప్రకారం కరణ్ అని పేరు మార్చకున్నాడు. 2012లో ఇతను ఉద్యోగం నిలిపి వేసి ఇంటిలోనే ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ ఇంటిలో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేశాడు.

భార్య సంపాదనతో నిత్యం జల్సాలు చేసేవాడు. భార్య ఉద్యోగానికి వెళ్లిన తరువాత కిడ్నాప్స్, బ్లాక్ మెయిల్స్, హత్యలు ఎక్కువగా ఉండే సినిమా సీడీలు ఇంటికి తెచ్చుకుని చూసేవాడు. సినిమాలు చూసిన మహమ్మద్ నేరాలు సులభంగా చెయ్యవచ్చని భావించాడు. ఒక్కసారి హైల్త్ క్యాంప్‌లో ఎలక్రాటిక్ సిటిలో నివాసం ఉంటున్న వైద్యుడు విజిటింగ్ కార్డును మహమ్మద్ సంపాదించాడు. విజిటింగ్ కార్డులో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి గుర్తించాడు. డాక్టర్ ఫేస్‌బుక్‌లో ఆయన భార్య, 9 సంవత్సరాల కుమారుడిని గుర్తించాడు.

 Police arrest man, who cheats doctor

అనంతరం రూ.10 లక్షలు ఇవ్వకుంటే నీ కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తానని డాక్టర్‌కు ఇ-మెయిల్ పంపించాడు. పదేపదే బెదిరింపు మెయిల్స్ రావడంతో డాక్టర్ బెదిరాడు. దీనిని గుర్తించిన మహమ్మద్ రూ.10 లక్షలు కాదు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కర్ణాటకలోని వివిద చోట్ల నుండి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, హిందుపురం వెళ్లి అక్కడి నుండి డాక్టర్ కు బెదిరింపు మెయిల్స్ పంపించాడు. చివరికి డాక్టర్ బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ప్లాన్ ప్రకారం డాక్టర్ మహమ్మద్‌ను ఇ-మెయిల్ ద్వారా సంప్రదించాడు. డబ్బు ఇస్తానని నమ్మించాడు. బెంగళూరు శివార్లలోని నెలమంగల దగ్గరకు బ్యాగ్‌లో నగదు తీసుకురావాలని మహమ్మద్ చెప్పాడు. అక్కడికి మెయిన్ రోడ్డు నుండి కాకుండ ఎలా రావాలి, ఎలా వెళ్లాలి అంటు మహమ్మద్ స్వయంగా రూట్ మ్యాప్ ఇచ్చాడు.

మంగళవారం రాత్రి డాక్టర్ నగదు తీసుకుని నెలమంగల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే పోలీసులు మఫ్టీలో అక్కడ మకాం వేశారు. డాక్టర్ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్లిపోయారు. 24 గంటలు దాటినా మహమ్మద్ అక్కడికి వెళ్లలేదు. విసిగిపోయిన పోలీసులు బ్యాగ్ తీసుకుని వెనుదిరుగుదామని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో నగదు తీసుకొవడానికి అక్కడికి వెళ్లిన మహమ్మద్ పోలీసులకు చిక్కాడు. మహమ్మద్ సీసీ కెమెరాలు లేని సైబర్ సెంటర్లకు వెళ్లి బెదిరింపు మెయిల్స్ చేసేవాడని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వారికి ఇ-మెయిల్స్ ఐడిలు ఇవ్వరాదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+