బుద్ది చూపిన రిటైడ్ ఎస్ఐ మేడమ్, మొగుడితో కలిసి ఏం చేసిందంటే?, కిలాడి స్కెచ్ వేసి!

ప్రమాదం జరిగిందని, ప్రమాదవశాత్తు ఓ మహిళ చనిపోయిందన తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రిటైర్డ్‌ ఎస్‌ఐ రంగలక్ష్మమ్మ, ఆమె భర్త నారాయణస్వామిని కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు నగరంలోని టేకల్ రోడ్డులో ప్రమాదం జరిగిందని రిటైడ్ ఎస్ఐ దంపతులు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై రిటైడ్ మహిళా ఎస్ఐ రంగలక్ష్మమ్మ, ఆమె భర్త నారాయణస్వామిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కోలారులో రిటైడ్ ఎస్ఐ రంగలక్ష్మమ్మ కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నారు. రంగలక్ష్మమ్మ ఇంటి నిర్మాణంలో కోలారులోని పిండిపాపనహళ్లికి చెందిన లక్ష్మమ్మ(65) పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా అదే భవనంలో లక్ష్మమ్మ పని చేస్తున్నారని తెలిసింది.

Police arrested a retired lady SI and her husband in a case of giving false information in Kolar

అయితే లక్ష్మమ్మ అదే ఇంటి మెట్లపై నుంచి కందపడి గాయపడింది. చికిత్స విఫలమై ఫిబ్రవరి 23వ తేదీన లక్ష్మమ్మ మృతి చెందింది. అయితే లక్ష్మమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయిందని రంగలక్ష్మమ్మ, నారాయణస్వామి దంపతులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారని పోలీసు అధికారులు తెలిపారు. మృతురాలు లక్ష్మమ్మ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకు ముందు ఏం జరిగిందో కూడా పోలీసులు మీడియాకు చెప్పారు. రోడ్డు మీద వెలుతున్న లక్ష్మమ్మకు ప్రమాదం జరిగిందని ఇంటి యజమాని నారాయణస్వామి, అతని భార్య రిటైడ్ ఎస్ఐ రంగలాక్షమ్మ దంపతులు బాధితురాలు లక్ష్మమ్మ బంధువులకు సమాచారం అందించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మృతుడి బంధువు తిరుమలప్ప కోలార్ నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో దంపతులు తప్పుడు సమాచారం ఇచ్చారని వెలుగు చూసింది.పోలీసుల విచారణలో రంగలక్ష్మమ్మ, నారాయణస్వామి తప్పుడు సమాచారం ఇచ్చారని తేలింది. ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన రిటైర్డ్ పీఎస్‌ఐ రంగలక్ష్మమ్మ, ఆమె భర్త నారాయణస్వామిని అరెస్టు చేశారు. కోలార్ గల్ టౌన్ ఇన్ స్పెక్టర్ లోకేశ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+