మహేష్ పిస్టల్ విలువ రూ.1.50 లక్షలు: జీతం రూ.8 వేలు, ఎపి లింక్?
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి కాలేజ్ విద్యార్థిని గౌతమి (18)ని హత్య చేసిన అటెండర్ మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర ఉన్న పిస్తోల్, సజీవంగా ఉన్న ఆరు బుల్లెట్ లు స్వాదీనం చేసుకున్నామని బెంగళూరు తూర్పు విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ చెప్పారు.
ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్న మహేష్ నెల జీతం రూ. 8 వేలు. గౌతమిని హత్య చెయ్యడానికి అతను ఉపయోగించిన నాటు పిస్తోల్ విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. రూ. 8 వేలు జీతం తీసుకునే వ్యక్తి దగ్గర ఇంత విలువైన పిస్తోల్ ఏలా వచ్చింది అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో ఇలాంటి నాటు పిస్తోల్ లు తయారు చేస్తారని పోలీసు అధికారులు అంటున్నారు. పిస్తోల్ ఎవరి దగ్గర ఇతను కొనుగోలు చేశాడు అని కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు లేదా శివమొగ్గలో మహేష్ పిస్తోల్ కొనుగోలు చేసి ఉంటాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.

రెండు సంవత్సరాల క్రితం తాను కేఆర్ పురం రైల్వేష్టేషన్ దగ్గర పిస్తోల్ కొనుగోలు చేశానని మహేష్ అంటున్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. అయితే కేఆర్ పురం రైల్వే స్టేషన్ దగ్గర పిస్తోల్ కొనుగోలు చేసే అవకాశం లేదని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేఆర్ పురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిలో ఎవరైనా మహేష్ కు రివాల్వర్ విక్రయించారా అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్థానికులను కొందరిని విచారణ చేసి వివరాలు సేకరించారు.
కచ్చితంగా ఇతను శివమొగ్గ నుండి పిస్తోల్ తీసుకు వచ్చాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పూర్తి విచారణ చేసి అన్ని వివరాలు వెళ్లడిస్తామని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications