పుణె అత్యాచార కేసు.. సినిమా క్లైమాక్స్ ను మించిన ఛేజింగ్..!
మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్(36)గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు సినిమా రేంజ్ ఛేజింగ్ చేయాల్సి వచ్చింది. పుణె నగరం మొత్తం గాలించారు.
నిందితుడు పంటపొలాల్లో ఉన్నట్లు తెలిసి జాగిలాలతో గాలించారు. దత్తాత్రేయ రామదాస్ ను పట్టుకునేందుకు 500 మంది పోలీసులు, 400 మంది గ్రామస్థులు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్స్.. ఇలా అన్నింటినీ బరిలోకి దింపారు. 75 గంటలపాటు నిరంతర ఛేజింగ్ వల్ల ఎట్టకేలకు నిందితుడిని గురువారం అర్థరాత్రి దాటాక పట్టుకున్నారు పోలీసులు.

ఏం జరిగింది.. ?
సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. పుణేలోని ఇళ్లలో పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్‌గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను గమనించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి అక్క అని సంబోధిస్తూ.. బస్సు ముందు ఉందంటూ తీసుకెళ్లాడు. అక్కడ అంతా చీకటిగా ఉండగా.. బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని.. అందుకే లైట్లు ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు.
దీంతో అది నమ్మిన ఆ మహిళ బస్సు ఎక్కగానే.. వెంటనే లోపలికి చేరుకున్న ఆ వ్యక్తి డోర్ వేసి.. ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. బయటికి వచ్చి మరో బస్సు ఎక్కిన ఆ మహిళ.. తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధితురాలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications