కేజ్రీవాల్ సారీ: కుర్చీ గాల్లోకి, కర్రలతో ఇలా.. (పిక్చర్స్)
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ, ఎఎపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు లాఠీఛార్జి, బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా, కార్యకర్తల తీరుకు అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బిజెపి కార్యాలయం ముందు తమ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో... తమ వారి ప్రవర్తనకు మన్నించాలని కేజ్రీవాల్ కోరారు. తమపై దాడికి ప్రతీకారంగానే వారు అలా చేసి ఉండొచ్చని.. అయినా వారి ప్రవర్తనకు క్షమాపణ కోరుతున్నానని గుజరాత్‌లోని భుజ్‌లో కేజ్రీవాల్ చెప్పారు.

కర్రలతో...
పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో దాడులకు సంబంధించి 14 మంది ఆమ్ ఆద్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎఎపి వర్సెస్ బిజెపి
బుధవారం అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ కారు పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

బిజెపి కార్యాలయం ఎదుట
బుధవారం కారుపై దాడి నేపథ్యంలో గురువారం పది పోలీసు జీపులతో అరవింద్ కేజ్రీవాల్‌కు భద్రత కల్పించారు. గుజరాత్‌లో కేజ్రీవాల్ నాలుగు రోజులు పర్యటించనున్నారు.

కేజ్రీవాల్ చోర్ అంటూ బిజెపి కార్యకర్తల ప్రదర్శన
అరవింద్ కేజ్రీవాల్ కచ్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన కారు పైన దాడి జరిగింది. ఈ సమయంలో బిజెపి, ఎఎపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఉద్రిక్తం
బుధవారం పలువురు నల్లటి జెండాలతో అరవింద్ కేజ్రీవాల్‌కు నిరసన తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అనుకూలంగా వారు నినాదాలు చేశారు.

కుర్చీలు గాల్లోకి
బిజెపి, ఎఎపి ఘర్షణ అంశంపై బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పందించారు. అబద్దాల ప్రచారమే ఎఎపి అస్త్రమని, బిజెపి నేతలు కేజ్రీవాల్ పార్టీ పైన దాడి చేశారన్న ఆరోపణలను కొట్టి పారేశారు.

పోలీసులు లాఠీఛార్జ్
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల పైన నమోదయిన కేసులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు గుజరాత్ ఎఎపి కార్యాలయానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

పోలీసులు
గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే.

గుజరాత్‌లో
భారతీయ జనతా పార్టీ, ఎఎపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు లాఠీఛార్జి, బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications