చిత్తూరు కజిన్ బ్రదర్స్ స్కెచ్ లు సూపర్, రైళ్లు, బస్సులు, తమిళ్ తంబితో !
తెల్లవారుజామున పీజీలలో చొరబడి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు చోరీకి పాల్పడుతున్న కజిన్ బ్రదర్స్ తో పాటు ముగ్గురిని బెంగళూరులోని యశ్వంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ వస్తులు కొనుగోలు చేసిన తమిళనాడు వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కజిన్ బ్రదర్స్ బెంగళూరులోని పీజీల్లో చేతివాటం చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన ప్రభు, అతని కజిన్ బ్రదర్ యువరాజ్, చోరీ చేసిన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన తమిళనాడుకు చెందిన సెల్వరాజ్‌ల అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ16 లక్షల విలువైన వివిధ కంపెనీలకు చెందిన 50 ల్యాప్‌టాప్‌లు, 7 ఖరీదైన మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో పరారీలో ఉన్న మరో నలుగురి ఆచూకీ కోసం విచారణ కొనసాగిస్తున్నట్లు బెంగళూరులోని యశవంతపురం పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల యశ్వంతపురంలోని పీజీల్లో ల్యాప్‌టాప్ దొంగతనాలు ఎక్కువైనట్లు సమాచారం. మత్తికెరె సమీపంలో తెల్లవారుజామున గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న ప్రభు, యువరాజ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు.
చిత్తూరు నుంచి బస్సు, రైలులో బెంగళూరు నగరానికి నిందితులు ప్రభు, యువరాజ్ వస్తున్నారని పోలీసులు అన్నారు. ఆ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉంటున్న పీజీల చుట్టూ పగలు తిరుగుతూ స్కెచ్ లు వేస్తున్న నిందితులు అనంతరం అర్థరాత్రి ఆ పీజీల వద్దకు వెళ్లి చేతివాటం ప్రదర్శించేవారని, ల్యాప్ టాప్ లు, విలువైన మొబైల్ ఫోన్లు చోరీ చేసి పారిపోతున్నారని పోలీసులు తెలిపారు.

యశ్వంతపురంలోని పీజీలలో చిత్తూరుకు చెందిన ఈ ఇద్దరూ చాలా కాలంగా చోరీలు చేశారని పోలీసులు తెలిపారు. గత మూడేళ్లుగా బెంగళూరు నగరంలో పీజీల్లో చోరీలకు పాల్పడుతున్నారనే విషయం విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి చోరీ చేసిన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ కు విక్రయిస్తున్నారని, ఆ డబ్బుతో కజిన్ బ్రదర్స్ జల్సాలు చేస్తున్నారని యశవంతపురం పోలీసు అధికారులు తెలిపారు. ఈ గ్యాంగ్ లోని మరో నలుగురు తప్పించుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications