ఆ దుర్మార్గుడు ఐదు రాష్ట్రాల్లో 50 రేప్ లు చేశాడు
బులంద్ షహర్: బులంద్ షహర్ జాతీయ రహదారిపై తల్లీ, కుమార్తె (మైనర్ ) గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు సలీం బావరియా అరచకాలు ఒకటి రెండు కాదని, అది కూడా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదని దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు చెప్పారు.
ఇప్పటి వరకు అతను 50 గ్యాంగ్ రేప్ లు చేశాడని, కుటుంబాలనే లక్షంగా చేసుకుని లైంగిక దాడులు చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు బీహార్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి గ్యాంగ్ రేప్ లు చేశారని పోలీసులు అన్నారు.

బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీం బావరియా తో సహ ఆరు మందిని అరెస్టు చేశారు. సలీం బావరియా తన అనుచరులతో కలిసి రాజస్థాన్ లోని హనుమాఘర్ లో జూన్ 30వ తేది బాలిక మీద గ్యాంగ్ రేప్ చేశాడు.
గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు ఆ బాలికకు చిత్రహింసలు పెట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. జులై నెల చివరిలో బులంద్ షహర్ జాతీయ రహదారిపై కారులో వెలుతున్న ఓ వాహనం అడ్డగించి తల్లీ, ఆమె 13 సంవత్సరాల కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేశారు.
జాతీయ రహదారులలో వాహనాలలో వెలుతున్న కుటుంబ సభ్యులను అడ్డగించి బందిపోట్లు లాగా దోపిడీలు చేశారని విచారణలో అంగీకరించారని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications