పెళ్లి మీద పెళ్లి: పోలీసు అధికారికి 15 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: అత్యాచారం, మహిళలను మోసం చేశారని నమోదు అయిన కేసులో ఢిల్లీలోని ఓ పోలీసు అధికారికి కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించి సంచలనమైన తీర్పు చెప్పింది. ఇక మీద ఎవ్వరూ ఇలాంటి తప్పు చెయ్యకుండా ఉండటానికి నిందితుడికి ఈ శిక్ష విధించామని న్యాయస్థానం తీర్పులో వెల్లడించింది.
నిందితుడు రవి రాథీకి న్యాయస్థానం జైలు శిక్షతో పాటు రూ. మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. రవి రాథీ 2009 పోలీసు ట్రైనింగ్ కాలేజ్ లో ఉన్న సమయంలో అక్కడ ఓ యువతి పరిచయం అయ్యింది. ఇద్దరూ పోలీసు శాఖకు చెందిన వారే కావడంతో 2013 అక్టోబర్ లో రహస్యంగా వివాహం చేసుకున్నారు.

అయితే అప్పటికే రవి రాథీకి వివాహం అయ్యిందని వెలుగు చూడటంతో ఆమె సర్దుకు పోయింది. అయితే రవి సాథీ అదే సంవత్సరం మరో యువతిని వివాహం చేసుకున్నాడని వెలుగు చూడటంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.
పోలీసులు కేసు నమోదు చేసి రవి రాథీని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం ఇద్దరు మహిళల జీవితంతో చెలగాటం ఆడుకున్నాడని, వారి మనోభావాలు దెబ్బతీశాడని ఇలాంటి మోసం మరెవ్వరూ చెయ్యకుండ రవి రాథీకి ఈ శిక్ష విధిస్తున్నామని బుధవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.












Click it and Unblock the Notifications