తెలుగు రాష్ట్రాల్లోని ఎన్‌కౌంటర్లపై లోకసభలో ఆక్షేపణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు పోలీసు ఎన్‌కౌంటర్లపై ప్రతిపక్ష సభ్యులు మంగళవారం లోకసభలో ప్రస్తావించారు. ఈ ఎన్‌కౌంటర్లపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆక్షేపణలు తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా పంచారని విమర్సిస్తూ ఆ రెండు ఎన్‌కౌంటర్లపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఐయుఎంఎల్ సభ్యుడు ఇ. అహ్మద్ నల్లగొండ జిల్లాలోని ఆలేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ ఐదుగురు మైనారిటీ యువకులను పోలీసులు కాల్చి చంపారని ఆరోపించారు. న్యాయవిచారణ సాధ్యం కాకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావించవద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆహ్మద్‌కు చెప్పారు. ఆ విషయంపై చర్చించకూడదని అన్నారు. అయితే, ఆ సంఘటనపై విచారణ జరిపించాలని డిప్యూటీ స్పీకర్ ఎం. తంబిదురై ఒత్తిడి తెచ్చారు.
తంబిదురై ప్రస్తావన స్పీకర్‌ను కాస్తా ఇబ్బందుల్లో పడేసింది. మీరు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. "మీరు నేరుగా ఆ అంశాన్ని ప్రస్తావించకూడదు. మీరు నాకు చెప్పాలి" అని ఆమె తంబిదురైకి చెప్పారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి సమాధానం కావాలని తంబిదురై అన్న తర్వాత సుమిత్రా మహాజన్ ఆ విధంగా అన్నారు.
ఆ సంఘటనలపై రాష్ట్రాల నుంచి నివేదికలు కోరామని, అవి రాగానే సభ్యులకు తెలియజేస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు .












Click it and Unblock the Notifications