వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన పోలీసులు, చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశేష్ కుమార్ అనే వ్యాపారి బరేలీలోని ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో కుటుంబసబ్యులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం సాయంత్రం నగరంలోని మరో ప్రాంతంలో విశేష్ కుమార్ తన కారులోనే రక్తపు మడుగులో మృతి చెంది కనిపించాడు.

లక్నో

అతడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లైసెన్స్ లేని తుపాకీ లభ్యమవడంతో మృతి చెందిన వ్యాపారిపై పోలీసులు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయుధాల చట్టం ప్రకారమే తాము కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై యువకుడు రేప్

ఓ మైనర్‌ బాలికపై పక్కింట్లో నివసించే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందూసీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనిమీద పొరుగింటికి వెళ్లిన 13ఏళ్ల అమ్మాయిపై ఆ ఇంట్లో ఉన్న లవకేశ్‌(20) అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Even as his kin grope in the dark to understand why a local businessman might have shot himself dead, UP police have filed a case against the dead man under Section 25 of the Arms Act, charging him with illegal possession of a firearm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X