కూటమి సర్కార్‌లో పోలీసుల వెతలు ఇవీ: పార చేతబట్టి..రోడ్లపై గుంతలు పూడ్చుతూ !!
Police fill potholes: వర్షాకాలంలో రోడ్లపై పడ్డ గుంతలను పోలీసులు దగ్గరుండి మరీ పూడ్చడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. కాంట్రాక్టర్లు ఏం చేస్తోన్నారంటూ ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల భగ్గుమంటోన్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో మహారాష్ట్రలో కొద్దిరోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ముంబై సహా పలు జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి. రోజుల నీటిలో నానుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

రోడ్ల గురించి చెప్పుకోనక్కర్లేదు. అధ్వాన్నంగా తయారయ్యాయవి. జాతీయ రహదారులు సైతం అనేక చోట్ల కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు రాకపోకలు సాగించడానికి ఏమాత్రం అనుకూలంగా ఉండట్లేదు. ముంబై, థానె సహా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అత్యంత దారుణంగా మారాయి.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన (ఏక్‌నాథ్ షిండే)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఈ గోతులను పూడ్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దీనితో ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పడ్డ భారీ గోతులను పూడ్చడానికి మహారాష్ట్రలో అికస్వయంగా పోలీసులు ముందుకొచ్చారు.

ముంబైలో అత్యంత రద్దీ ప్రాంతాలైన మిరా భయాందర్ ప్రాంతంలో గోతులను పూడ్చారు కొంతమంది పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తమ ప్యాంట్లను మడిచి కట్టి.. పార తీసుకుని సిమెంట్, కంకరతో గోతులను పూడ్చుతూ కనిపించారీ వీడియోలో.
ఇది కాస్తా రాజకీయ దుమారం రేపుతోంది. శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే ఘాటు విమర్శలు చేశారు. పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఏఐ.. సిగ్గు పడాల్సిన చర్యగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications