మహిళా ఉద్యోగికి పోలీసు అధికారి అసభ్యకర సందేశాలు

2013లో చట్టం వచ్చాక మహిళ పట్ల లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణ జరపడం ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే మొదటిది! నిర్భయ చట్టం వచ్చాక ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం.
ఇదిలా ఉండగా.. బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళా పోలీసు ఇన్స్‌పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. వీరు పూర్తి నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారు.
కాగా, సదరు పోలీసు అధికారి బాధిత మహిళా ఉద్యోగురాలికి అసభ్యకర సందేశాలు పంపించారు. నిందితుడు, బాధిత ఉద్యోగస్తురాలు ఇద్దరు కూడా కేంద్రపర పోలీసు స్టేషన్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications