కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులను చంపేశారు
రాయ్‌పూర్: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నలుగురు పోలీసులను హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో నలుగురు పోలీసులను సోమవారం సాయంత్రం మావోయిస్టులు అపహరించిన విషయం విదితమే.
అపహరించిన పోలీసులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన గుమ్డా గ్రామంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన పోలీసులు జయదేవ్ యాదవ్, మంగాల్ సోదీ, రాజు తేల, రామా మజ్జీ. మావోయిస్టులపై దాడులకు ప్రతీకారంగానే పోలీసులను హతమార్చినట్లు తెలుస్తోంది.

సదరు పోలీసుల మృతదేహాలను బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కు గురైన ప్రాంతానికి కేవలం 5 కి.మీ దూరంలో వీరి మృతదేహాలను స్థానికులు కనుగోన్నారు.
బీజాపూర్ జిల్లాలో కుట్రూకి వెళ్తున్న బస్సును సోమవారం రాత్రి అడ్డగించి... అందులో ప్రయాణిస్తున్న నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ డిజిపి అమర్‌నాథ్ ఉపాధ్యాయ సోమవారం రాత్రి ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications