టీ, స్నాక్స్ అందించి పూలు చల్లిన పోలీసులు.. రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు మరోసారి ఉద్రిక్తంగా పరిస్థితి నెలకొంద. చలో ఢిల్లీ పిలుపులో భాగంగా రైతులు తిరిగి ప్రారంభించిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు వాటిని దాటుకొని వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు రైతులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి చలో ఢిల్లీ పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం తోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో 101మంది రైతులు చలో ఢిల్లీ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.

అయితే, పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు గాయపడగా- రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేతలు చెప్పారు.
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున చలో ఢిల్లీ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ఆదివారం ఉదయం చెప్పారు. దీంతో హర్యానా ప్రభుత్వం భారీగా పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రైతులు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధం కావడంతో.. అనుమతి ఉంటే చూపించాలని హర్యానా పోలీసులు కోరారు.
#WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers
— ANI (@ANI) December 8, 2024
"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw
అయితే, రైతులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు కదలారు. దీంతో పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో శంభు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా, అంతకుముందు ఆందోళన చేస్తున్న రైతులకు టీ, స్నాక్స్ అందించారు పోలీసులు. అంతేగాక, వారిపై పూలు చల్లారు. అయితే, ఆందోళనలను విరమించాలని కోరినప్పటికీ.. వినకపోవడంతో టియర్ గ్యాస్ జరిపారు పోలీసులు.
చలో ఢిల్లీ వాయిదా
పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన చలో ఢిల్లీ పాదయాత్రను రైతు సంఘాల నేతలు తాత్కాలికంగా నిలిపివేశారు. శంభుసరిహద్దు వద్ద ఆదివారం మరోసారి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలుగురు గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications