రైలు మరుగుదొడ్లో రద్దు చేసిన నాలుగున్నర లక్షల నగదు

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్ :రద్దుచేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు కొందరు ఇబ్బందులు పడుతోంటే , నల్లధనం ఉన్నవారు మాత్రం ఈ డబ్బును వదిలించుకొనేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఏ రకంగా ఈ ధనాన్ని వదిలించుకోవాలనే విషయమై ఆలోచిస్తున్నారు. చెత్తకుప్పలు, నదుల్లో పారేసిన ఘటనలే కాకుండా రైలు మరుగుదొడ్లలో కూడ రద్దుచేసిన నగదును వదిలివెళ్ళిన ఘటన ఓకటి వెలుగు చూసింది.

డిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ టాయి లెట్ లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది.రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయల నగదు సుమారు నాలుగున్నర లక్షలను రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ నగదును వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

police seize 4.5 lakhs of banned currency in rail toilet

ఈ నగదును ఆదాయపుపన్ను శాఖాధికారులకు అప్పగించారు రైల్వే పోలీసులు. మరుగుదొడ్డిలో నాలుగున్నర లక్షల నగదును స్వాధీనం చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నగదును మరుగుదొడ్లో గుర్తించకముందే ముగ్గురు అనుమానితులు మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన విషయాన్ని ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొననారు. ఈ నగదు వారిదేనా, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
4.5 lakhs banned currency identify in rail toilet . railway police seized 4.5 lakhs banned currency recently bhuvaneshwar- delhi train toilet.police arrest three people.
Please Wait while comments are loading...