ఉగ్రవాదులతో పోలీస్ ఎదురు కాల్పులు: ఆరుగురు మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌లోకి ఉగ్రవాదులు చొచ్చుకుని వచ్చారు. ఉగ్రవాదులు పలువురిని నిర్బంధించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. ఓ పౌరుడు, ఓ పోలీసు, ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
సాయుధులు పోలీసు స్టేషన్‌లోకి చొచ్చుకుని వచ్చిన సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులు గంటన్నరకు పైగా సాగాయి. ఫిదాయీ గ్రూప్‌నకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో లోనికి ప్రవేశించారు.

శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ముగ్గురు సాయుధులు రాజ్‌బాగ్ పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఈ పోలీసు స్టేషన్ అంతర్జాతీయ సరిహద్దులకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఉగ్రవాదులు తాజాగా దేశంలోకి చొచ్చుకుని వచ్చినట్లు భావిస్తున్నారు. గత రాత్రి వారు భారత భూభాగంలోకి అడుగు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
ముఫ్తీ మొహమ్మద్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దీన్ని మొదటి పెద్ద దాడిగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications