పోలియో వ్యాక్సిన్ ప్లాంటులో కొవాగ్జిన్ ఉత్పత్తి -బిబ్కాల్ టార్గెట్ నెలకు 2కోట్ల డోసులు -అదే గందరగోళం

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్లపై గందరగోళం కొనసాగుతోంది. 18-44ఏళ్ల వయసువారికి టీకాలు అందించే బాధ్యతను కేంద్రం.. రాష్ట్రాలపైకే నెట్టేయడంతో ఏపీ, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్ల ద్వారా నేరుగా వ్యాక్సిన్లను సేకరించాలని భావిస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాలకు అడ్డుకట్టవేసిన కేంద్రం.. కరోనా టీకాల ఉత్పత్తి సంస్థల నుంచి తమకు అవసరమైన మేరకు వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేసే అవకాశం రాష్ట్రాలకు లేదని తేల్చిచెప్పింది. అదేసమయంలో దేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది..

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం వివరణ ప్రకారం వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను సిద్దం చేసింది. ప్రధానంగా పోలియో వ్యాక్సిన్ తయారీదారు ''భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్‌ (బిబ్కాల్)''ను సైతం కొవాగ్జిన్ తయారీకి వాడుకోనుంది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో గల బిబ్కాల్ పోలియో వ్యాక్సిన్ ప్లాంటులో ఇప్పుడు కొవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు..

Polio vaccine maker BIBCOL to produce 2cr Covaxin doses at UPs Bulandshahr plant every month

ఏడాదికి 6కోట్ల పోలియో వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న బిబ్కాల్ బులంద్ షహర్ ప్లాంటులో ఇప్పుడు సామర్థ్యాన్ని పెంచి, కొవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేసేలా భారత్ బయోటెక్ సంస్థతో ఎంవోయూలు కూడా కుదిరాయి. కేంద్రం సైతం అన్ని రకాల అనుమతులు ఇచ్చేసింది. బులంద్ షహర్ ప్లాంటులో నెలకు 2కోట్ల కొవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్నారు. అంతేకాదు, కేంద్ర ఆరోగ్య శాఖ బిబ్కాల్ కు రూ.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది.

ఆత్మనిర్భర్ భారత్ ౩.౦లో భాగంగా మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర సర్కారు.. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న క్రమంలోనే బిబ్కాల్ ప్లాంటుకూ రూ.30 కోట్లు కేటాయించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ బయోటెక్ బెంగళూరు కేంద్రానికి రూ.65 కోట్లను కేంద్రం కేటాయించడం తెలిసిందే. ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఉన్న భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్‌ కంపెనీలను వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ఎంపిక చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+