వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌రేంద్ర‌మోడీతో మైండ్‌గేమ్ ఆడుతున్న యువ ముఖ్య‌మంత్రి

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం రాజ‌కీయంగా బ‌లాన్ని పెంచుకునేందుకు రాష్ట్రాల్లో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌భుత్వాల‌నే మార్చేస్తూ రోజురోజుకూ బ‌లం పెంచుకుంటూ వెళుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసుకోగ‌లిగింది. రాజ‌కీయంగా ఎదురేలేదంటూ మెరుపు వేగంతో దూసుకు వెళుతున్న ఎన్డీయేకి జార్కండ్ యువ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ బ్రేకులు వేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రితోనే ఆయ‌న మైండ్ గేమ్ ప్రారంభించారు.

ఊహించనిరీతిలో షాక్

ఊహించనిరీతిలో షాక్


విభిన్న‌మైన వ్యూహాల‌తో రాష్ట్రాల్లో బ‌లం పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి జార్కండ్ లో ఊహించ‌నిరీతిలో షాక్ త‌గిలింది. బీజేపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని జేఎంఎం అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక స్థానంలో విజ‌యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 25 సీట్లు ద‌క్కాయి. గిరిజ‌న జ‌నాభా ఎక్కువ ఉండే ఈ రాష్ట్రం మొన్న‌టి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్యర్థినిగా పోటీచేసిన ద్రౌప‌ది ముర్ముకే జేఎంఎం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ..

అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ..


ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఆయన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన తర్వాతే ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాతే 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు జేఎంఎం టచ్ లోకి వెళ్లారు. అయితే రెండురోజుల క్రితం బెంగాల్ సరిహద్దుల్లో భారీ నగదుతో జార్కండ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. వీరిని పార్టీ నుంచి సోనియాగాంధీ సస్పెండ్ చేశారు. తమతోపాటు మిత్రపక్షంగా ఉండి అధికారంలో కొనసాగుతున్న వీరు అంత నగదుతో ఎందుకు తరలివెళుతున్నారు? నగదు ఎక్కడికి తీసుకువస్తున్నారు? ఎవరు ఇచ్చారు? తదితర కోణాల్లో జార్కండ్ ప్రభుత్వం అంతర్గతంగా సమాచారం సేకరించింది

ఎమ్మెల్యేల అరెస్ట్ తో వెనకడుగు వేసింది ఎవరు?

ఎమ్మెల్యేల అరెస్ట్ తో వెనకడుగు వేసింది ఎవరు?


మోడీ తర్వాత లక్ష్యం బెంగాల్ లేదా జార్కండ్ కావచ్చంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆమె ప్రకటించిన తర్వాతే ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. జార్కండ్ లో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అంతుచిక్కని వ్యూహాలకు వేదికవుతున్నాయని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు పట్టుబడిన తర్వాతే తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని జేఎంఎం వర్గాలు వెల్లడించాయి. ఒకరి వ్యూహాలను మరొకరు అర్థం చేసుకుంటూ ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జేఎంఎం తర్వాత ఏ అడుగు వేయబోతున్నాయా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.

English summary
politcial fight between narendra modi and jarkhanc cm hemanth soren
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X