గుజరాత్ రాజకీయాల్లో కీలక మలుపు: సీఎం మినహా అందరూ రాజీనామా!
గుజరాత్ లో అనూహ్యంగా భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మినహాయించి రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ రాజీనామాలు తీసుకోబడ్డాయి. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకులు మంత్రులకు తెలియజేయగా.. వారంతా తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
నేడు రాజీనామాల సమర్పణ.. రేపు కొత్త కేబినెట్ ఏర్పాటు
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ రోజు రాత్రి గవర్నర్‌ను కలిసి మంత్రివర్గ సభ్యుల రాజీనామాలను అందజేయనున్నారు. ఈ చర్య రాష్ట్రంలో జరగబోయే కేబినెట్ విస్తరణలో భాగంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. రేపు అంటే శుక్రవారం ఉదయం 11:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు.

మార్పు వెనుక కారణాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ, ముఖ్యమంత్రి మినహా రాష్ట్ర ప్రభుత్వంలోని 16 మంది మంత్రులందరినీ రాజీనామా చేయమని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పెద్ద ఎత్తున మార్పు వెనుక పార్టీ లక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంస్థాగత, ప్రభుత్వ స్థాయిలో కొత్త శక్తిని తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. దీంతో రాష్ట్రంలో యువ, కొత్త నాయకులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.2027లో గుజరాత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పరిపాలనా, రాజకీయ స్థాయిలో బలమైన కొత్త బృందాన్ని సిద్ధం చేసుకోవడం కూడా దీనికి కారణం.సీఎం కార్యాలయం లేదా బీజేపీ నుంచి ఈ పరిణామంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ చర్య గుజరాత్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.












Click it and Unblock the Notifications