వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Political war: నువ్వు, నీ సీఎం సీటు శాశ్వతమా? మాజీ ప్రధాని కొడుకు వార్నింగ్, గేమ్స్ వద్దు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: మా జిల్లాలో కాలేజ్ కట్టడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన సీఎంపై మాజీ ప్రధాని కొడుకు, మాజీ మంత్రి ఏకవచనంతో ఏకిపారేశారు. నువ్వు, నీ సీఎం సీటు శాస్వతం అనుకుంటున్నావా ? కాలేజ్ అనుమతులు రద్దు చేస్తే నేను చేతులు ముడుచుకుని కుర్చోంటానా ? నేను ఏమిటో, నా సత్తా ఏమిటో చూపిస్తా ?, అంత సామాన్యంగా వదలిపెట్టే కుటుంబం కాదు మాది, మాతో పెట్టుకుంటే ఎలాగుంటుందో చూపిస్తాం అంటూ ముఖ్యమంత్రికి మాజీ ప్రధాని కొడుకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అధికారంలో ఉన్న నువ్వు ఇలాగే ఉండిపోతావని మాత్రం కలలు కనద్దు అంటూ సీఎంకు మాజీ మంత్రి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో రాజకీయంగా తీవ్రచర్చకు దారితీసింది.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

హార్టికల్చర్ కాలేజ్ రాద్దాంతం

హార్టికల్చర్ కాలేజ్ రాద్దాంతం

హాసన్ జిల్లాలో హార్టికల్చర్ కాలేజ్ నిర్మించడానికి గతంలో సీఎం. కుమారస్వామి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హాసన్ జిల్లాలో హార్టికల్చర్ కాలేజ్ నిర్మించడానికి ఇచ్చిన అనుమతులను ప్రస్తుత బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఆరోపణలు చేస్తున్నారు.

అంతే కదా, ఇప్పుడు ఏం అయ్యింది ?

అంతే కదా, ఇప్పుడు ఏం అయ్యింది ?


హాసన్ జిల్లాలో హార్టికల్చర్ కాలేజ్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం రద్దు చేసింది అంతే కదా, ఇప్పుడు ఏం అయ్యింది ? ఇంతకు మంచి వీరు ఏం చెయ్యగలరు అని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హాసన్ జిల్లాలో హార్టికల్చర్ కాలేజ్ ఎలా నిర్మించాలో ? ఆ అనుమతులు ఎలా తీసుకోవాలో తనకు బాగా తెలుసని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ అన్నారు.

 నువ్వు....నీ సీఎం సీటు శాస్వతమా ?

నువ్వు....నీ సీఎం సీటు శాస్వతమా ?


ఇదే సందర్బంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను ఏకవచనంతో మాట్లాడుతూ ఏకిపారేశారు. నువ్వు, నీ సీఎం సీటు శాస్వతం అనుకుంటున్నావా యడియూరప్ప, నీ వల్ల అయ్యింది కాలేజ్ అనుమతులు రద్దు చెయ్యడమే, ఆ కాలేజ్ కి ఎలా అనుమతులు తీసుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో మాకు బాగా తెలుసు అని గుర్తు పెట్టుకో అంటూ సీఎం యడియూరప్పను మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ హెచ్చరించారు.

దేవేగౌడ ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావ్ ?

దేవేగౌడ ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావ్ ?

నువ్వు ఈ రోజు సీఎం పదవిలో ఉంటూ మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఫ్యామిలీతో కక్ష రాజకీయాలు సాధించాలని ప్రయత్నిస్తున్నావ్, నీ ఆటలు చాలా రోజులు సాగవు అంటూ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ హెచ్చరించారు.దేవేగౌడ కుటుంబం మీద ఉన్న కక్షను నువ్వు (ఏకవచనం)తో హాసన్ జిల్లా ప్రజల మీద తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నావని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ సీఎం బీఎస్. యడియూరప్ప మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 నా ప్రాణాలు ఉండేలోపు !

నా ప్రాణాలు ఉండేలోపు !

తాను బతికుండే లోపు హాసన్ జిల్లాలో ఎన్ని కాలేజ్ లు నిర్మించాలో అన్ని కాలేజ్ లు నిర్మిస్తానని, ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తానని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి మాజీ మంత్రి హెచ్.డీ, రేవణ్ణ సవాలు విసిరారు. ఆ రోజు మండ్య బడ్జెట్, హాసన్ బడ్జెట్ అంటూ ఆరోపణలు చేసిన మీరు ఈ రోజు ఇలాంటి కక్ష రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు ? అని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ప్రశ్నించారు. మొత్తం మీద సీఎం యడియూరప్పను మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఏకవచనంతో ఏకిపారేడయంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

English summary
Political war: JDS Leader HD Revanna Angry On Karnataka CM Yediyurappa For Cancelling Horticulture College Allotted To Hassan,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X