మణిపూర్ లో పోలింగ్ షురూ - చివరి దశలో ఉత్కంఠ : భారీ భద్రతా ఏర్పాట్లు..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో చివరి దశ పోలింగ్ మొదలైంది. ఉత్తర ప్రదేశ్ లో ఏడో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. దీని ద్వారా అయిదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక, పోలింగ్ తేదీల మార్పు తరువాత ఈ రోజున మణిపూర్ లో రెండో దశ..చివరి విడత పోలింగ్ భారీ భద్రత మధ్య మొదలైంది. మొత్తం 1247 పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఎన్నికల అధికారి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు.

భారీ బందోబస్తు ఏర్పాటు
ఈ రోజు పోలింగ్ లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేల్చుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓ ఇబోబి సింగ్ మరియు మాజీ డిప్యూటీ సిఎం గైఖాంగమ్ గాంగ్‌మీ వారిలో ఉన్నారు. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తౌబాల్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్ మరియు జిరిబామ్ జిల్లాల్లో ఈ దశలో మొత్తం 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
92 మంది అభ్యర్థుల్లో 17 మందికి నేర చరిత్ర ఉందని అగర్వాల్ తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా.. 223 పోలింగ్ కేంద్రాలను మహిళా పోలింగ్ సిబ్బందితో పూర్తిస్థాయిలో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

కోవిడ్ ప్రోటోకాల్ మధ్య
అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ .. వీడియోగ్రఫీ కోసం ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో తగినంత కేంద్ర బలగాలను మోహరించారు. ఫిబ్రవరి 28న జరిగిన మొదటి దశ ఓటింగ్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి .చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి మరియు ఇంఫాల్ ఈస్ట్ మూడు జిల్లాల్లోని 12 పోలింగ్ స్టేషన్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించారు. అక్రమార్కుల వల్ల ఈవీఎంలు ధ్వంసం అయిన ప్రాంతాల్లో రీపోలింగ్ ఈ రోజు జరగనుంది. పోలింగ్ సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజులు, ముఖ కవచాలు, థర్మల్ స్కానర్లు, పిపిఇ కిట్‌లు కూడా అందించారు.
Recommended Video

4 గంటల వరకే పోలింగ్
కోవిడ్ పాజిటివ్‌గా ఉన్న లేదా క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, తౌబల్ జిల్లాలోని హీరోక్ నియోజకవర్గంలోని 18 సంవత్సరాలకు సమీపంలో ఉన్న ఓటర్లందరూ పోలింగ్ స్టేషన్‌లో పుట్టిన తేదీ రుజువుకు సంబంధించిన రెండు వేర్వేరు పత్రాలను సమర్పించాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన మిగిలిన నాలుగ రాష్ట్రాలతో పాటుగా మణిపూర్ ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications