180 మంది కోసం 13,500 అడుగుల ఎత్తులో..! మంచుకొండల్లో పోలింగ్ కేంద్రాలు
సిక్కిం : లోక్‌సభ ఎన్నికల వేళ సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. తూర్పు సిక్కిం ప్రాంతంలోని జ్ఞాతంగ్ మంచుకొండపై.. సముద్ర మట్టానికి 13 వేల 500 అడుగుల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయడం చర్చానీయాంశమైంది.

జ్ఞాతంగ్ మచోంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఇక్కడి వాతావరణం గురించి తెలిసినవారు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించడం సాహసమే అంటున్నారు. దట్టంగా మంచు కమ్ముకొని ఉండటంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారట. మరో 48 గంటలు మంచు కురియడంతో పాటు వర్షం పడే ఛాన్స్ కూడా ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న మాట.












Click it and Unblock the Notifications