ప్రశాంతంగా పోలింగ్, యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో 40 శాతం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు విడతలుగా యూపీలో ఎన్నికలు నిర్వహిస్తుండగా 67 స్థనాలకు రెండో విడత పోలింగ్ బుధవారం జరుగుతోంది.
మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54.27 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 11 జిల్లాల్లో ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యూపీలోని మొరాదాబాద్ సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.

ఇక ఉత్తరాఖండ్ లో 69 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో మొత్తం 628 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు.
ఇక్కడ జరుగుతున్న పోలింగ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్ రావత్ డెహ్రాడూన్ లోని ధర్మపూర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications