రూ.100 కోట్ల మోసం.. పాంటీ చద్దా కుమారుడి అరెస్ట్..

ఢిల్లీ : ఆరేళ్ల క్రితం హత్యకు గురైన లిక్కర్‌ బారోన్‌ పాంటీ చద్దా కొడుకు, వేవ్‌ గ్రూపు వైస్ ఛైర్మన్ మణిప్రీత్‌ సింగ్‌ అలియాస్ మాంటీ చద్దాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ. 100 కోట్ల కుంభకోణం కోసులో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎకనమిక్ అఫెన్స్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మోసాలకు పాల్పడి థాయ్‌లాండ్‌కు పారిపోతుండగా.. అధికారులు చద్దాను అడ్డుకున్నారు.

ఉప్పల్ చద్దా హైటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వేవ్ గ్రూప్ ఛైర్మన్ మాంటీ చద్దాపై మోసం, అక్రమాలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయి. తక్కువ రేటుకే ఫ్లాట్లను ఇప్పిస్తానంటూ కస్టమర్లను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2017లో ఘజియాబాద్ హౌటెక్ టౌన్‌షిప్ పేరుతో మోంటీ చద్దా పలువురి వద్ద డబ్బు తీసుకున్నట్లు మాంటీతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వేవ్ గ్రూప్‌తో పాటు కంపెనీ ప్రమోటర్లపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

Ponty Chadhas Son Arrested At Delhi Airport

ఆస్తి వివాదం నేపథ్యంలో 2012 నవంబర్ 17న మాంటి చద్దా తండ్రి పాంటీ చద్దాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీంతో 19ఏళ్ల వయసులోనే మాంటీ తండ్రి బాధ్యతలు చేపట్టాడు. ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌తో పాటు కమర్షియల్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌ రంగంలో రాణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+