ఖుష్బూ గుడ్‌బై, బిజెపిలో చేరుతారనే ప్రచారం వెనుక..!
చెన్నై: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ డిఎంకె పార్టీని వీడటం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో డిఎంకె సీనియర్ నేత స్టాలిన్‌తో విభేదాలు కూడా కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
స్టాలిన్‌తో విభేదాలు వచ్చినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి సమసిపోయినట్లు చెప్పారు. అయితే స్టాలిన్‌తో పొసగక పోవడం వల్లనే ఆమె బయటకు వచ్చారని అంటున్నారు.
మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తనకు సీటు వస్తుందన్న ఆశతో ఆమె ఉన్నారట. చివరకు ఆమెకు పార్టీ మొండిచేయి చూపింది. అది ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసి ఉంటుందంటున్నారు.

ఖుష్బూ
ఖుష్బూ డిఎంకెకు రాజీనామా చేసిన వెంటనే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. దానిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు కూడా.

ఖుష్బూ
అయితే, ఆమె బిజెపిలో చేరుతారని ప్రచారం సాగడానికి కొన్ని కారణాలను చూపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెసు నేతలు కేంద్రమంత్రి స్మృతి ఇరానీని విద్యార్హత విషయంలో టార్గెట్ చేసినప్పుడు ఖుష్బూ ఆమెను సమర్థించారు.

ఖుష్బూ
అలాగే, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌తో ఖుష్బూకు పరిచయం ఉన్నట్లు, అందుకే ఆమెకు అభినందనలు సైతం ప్రకటించి ఉన్నారని అంటున్నారు. ఇలాంటి కారణాలే ఆమె బిజెపిలో చేరుతారనే ప్రచారానికి తావిచ్చాయంటున్నారు.

ఖుష్బూ
కాగా, ఎన్నికలప్పుడే బిజెపిలో చేరడానికి ఖుష్బూ మార్గం సుగమం చేసుకున్నట్లు సంకేతాలు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రచారానికి కోయంబత్తూరులో వచ్చినప్పుడు ఖుష్బూ పార్టీలో చేరాలనుకుంటే డిఎంకె బుజ్జగించినట్లుగా ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications