500 బ్లూ ఫిలిమ్స్ స్వాధీనం: ఫోర్న్ కింగ్ పిన్ అరెస్టు

బెంగళూరు: అశ్లీల చిత్రాలు, లైంగిక దాడుల క్లిప్పింగ్ లు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తున్న కీచకుడిని సీబీఐ కస్టడికి అప్పగించారు. నిందితుడిని నాలుగు రోజుల పాటు విచారణ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని సీతాపుర జిల్లాకు చెందిన కౌసిక్ సత్యపాల్ కునార్ ను సీబీఐ అధికారులు గురువారం రాత్రి బెంగళూరులోని మహదేవపురలో అరెస్టు చేశారు. నిందితుడి నుండి 9 అత్యాచారాలు చేస్తున్న క్లప్పింగ్ లు, 500 బ్లూ ఫిలింలు స్వాదీనం చేసుకున్నారు. ఈ దందాలో అనేక మంది ఉన్నారని సీబీఐ అధికారులు అంటున్నారు. 2013 నుండి కౌశిక్ బెంగళూరులో ఉంటున్నాడు.

ఫోర్న్ వీడియోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తు యువతను చెడుదోవ పట్టిస్తున్న కీలక సూత్రధారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా బెంగళూరులో తలదాచుకున్న ఫోర్న్ స్కాండల్ ప్రధాన నిందితుడు కౌశిక్ కునార్ అరెస్టు అయ్యాడు.

గురువారం రాత్రి కౌశిక్ కునార్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి అతని నుండి దాదాపు 500కు పైగా బ్లూ ఫిలిమ్స్ స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు అంటున్నారు. అతని దగ్గర పట్టుబడిన వస్తువులు చూసి సీబీఐ అధికారులు షాక్ కు గురి అయ్యారు.

 porn clips:arrests alleged kingpin from Bengaluru

కౌశిక్ కునార్ ఉన్నత కుటుంబంలో పుట్టాడు. కావాలసినంత డబ్బు ఉంది. విదేశాలలో చదువుకునే సత్తా ఉంది. పేరు పొందిన కాలేజీ నుంచి డిగ్రీ సంపాదించాడు. అయితే అతని బుద్ది మాత్రం పక్కదోవ పట్టింది. ప్రపంచంలోనే బ్లూ ఫిలింలకు పేరు పోందిన ఫోర్న్ వీడియోల మీద ఇతని కన్ను పడింది.

తరువాత అశ్లీల చిత్రాలను చిత్రీకరించేందుకు స్టెల్త్ కెమెరాలు, ఆ చిత్రాలను ఎడిట్ చేసేందుకు హై ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి బ్లూ ఫిలింలు రికార్డు చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసేవాడని సీబీఐ అధికారులు అంటున్నారు.

నిందితుడి మీద ఐటి యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేశామని, లైంగిక దాడి కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ అధికారులు అంటున్నారు. ఫోర్న్ వీడియోలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో చిత్రీకరించారనే విషయం తెలియక పోవడంతో సీబీఐ అధికారులు ఇబ్బంది పడ్డారు.

 porn clips:arrests alleged kingpin from Bengaluru

తరువాత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫోరెన్సిక్ సాఫ్ట్ వేర్ ఉపయెగించి వీడియోస్ అప్ లోడ్ చేస్తున్న వారి కోసం గాలించగా కౌశిక్ కునార్ చిక్కి పోయాడని సీబీఐ అధికారులు అన్నారు. మహిళలను తీవ్రంగా వేధించి, హింసించి అత్యాచారం జరిపి ఆ దృశ్యాలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తున్నారని హైదరాబాద్ కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ గుర్తించింది.

ఈ విషయంపై దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూకు లేఖ వ్రాసి మనవి చేసింది. సుప్రీం కోర్టు సుమోటో కేసుగా నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఫోర్న్ వీడియో స్కాండల్ ప్రధాన సూత్రధారి కౌశిక్ కునార్ చిక్కిపోయాడు. ఈ దందాలో మిగిలిన వారి కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+