పోర్నోగ్రఫీ కేసు : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తనను అలా .. నటి పూనమ్ పాండే షాకింగ్ కామెంట్స్
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ కుంద్రా అరెస్టుపై హర్షం వ్యక్తం చేసిన ఆమె న్యాయవ్యవస్థ పై తనకు నమ్మకం ఉందని, ఈసారి న్యాయమే గెలిచి తీరుతుందని వ్యాఖ్యానించారు.

రాజ్ కుంద్రా పై పూనమ్ పాండే షాకింగ్ వ్యాఖ్యలు
రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత స్పందించిన మోడల్-నటి పూనం పాండే శిల్పా శెట్టి మరియు ఆమె ఇద్దరు పిల్లలపై తన సానుభూతిని వ్యక్తం చేశారు. పూనమ్ పాండే తన మనసంతా శిల్పా శెట్టి, ఆమె ఇద్దరు పిల్లల దగ్గరే ఉందని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో 2019 లో తాను, రాజ్ కుంద్రా కలిసి ఒక యాప్ ను ప్రారంభించామని, ఆ యాప్ లావాదేవీల విషయంలో రాజ్ కుంద్రా తనను మోసం చేశారని పూనమ్ పాండే తెలిపారు.

రాజ్ కుంద్రా మోసం చేశారని కోర్టులో పిటీషన్ వేసిన పూనమ్ పాండే
ఈ వ్యవహారానికి సంబంధించి 2019లో తాను బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పిన ఆమె అప్పటినుండి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ వెల్లడించారు. రాజ్ కుంద్రాతో కలిసి తాను యాప్ బిజినెస్ ప్రారంభించగా, ఆదాయం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించి, పార్ట్నర్ షిప్ నుండి వైదొలుగుతున్నట్లు నోటీసులు పంపించానని పేర్కొన్న ఆమె ఆ తర్వాత తను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.

తన ఫోటోలు, పర్సనల్ నంబర్ యాప్ లలో లీక్ చేసి వేధించారని ఆరోపణ
రాజ్ కుంద్రా ఆయన టీం తన పర్సనల్ ఫోన్ నెంబర్ ను, తన ఫోటోలను కొన్ని ప్రైవేటు యాప్ లలో ఉంచి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోలు, నెంబరు యాప్ లో లీక్ అవడంతో చాలామంది తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అశ్లీల సందేశాలు, వీడియోలతో తనను వేధించారని పూనమ్ పాండే వెల్లడించారు. ఆ సమయంలో ఆ వేధింపులను భరించలేక మూడు నెలల పాటు తాను దేశం వదిలి వెళ్ళిపోయానని కూడా పూనమ్ పాండే తెలిపారు.
Recommended Video


రాజ్ కుంద్రాకు కఠిన శిక్ష పడాలన్న పూనమ్ పాండే
ఇదే సమయంలో తాజాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ను అరెస్ట్ చేయడంతో, అలాంటి వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని పూనమ్ పాండే వ్యాఖ్యానించారు. రాజ్ కుంద్రాకు శిక్ష పడటం కోసం తాను ఎదురుచూస్తున్నానని పూనమ్ పాండే వ్యాఖ్యానించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications