పోర్నోగ్రఫీ కేసు.. రాజ్ కుంద్రా తనను అరెస్ట్ చెయ్యకుండా పోలీసులకు భారీ లంచం ఇచ్చారని ఏసీబీకి మెయిల్
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అరెస్టు నుండి తప్పించుకోవడానికి రాజ్ కుంద్రా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
రాజ్ కుంద్రా లంచం ఇచ్చిన వ్యవహారాన్ని, ముంబై క్రైం పోలీసుల తీరును ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాస్తవ అలియాస్ యష్ ఠాకూర్ ఒక ఇమెయిల్ ద్వారా అవినీతి నిరోధక బ్యూరో కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హాట్ షాట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే గతంలో మార్చిలో ఈ రాకెట్ పై కేసు నమోదు అయిన సమయంలో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన వారికి 25 లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లుగా, ఈ కేసులో మరో నిందితుడు అరవింద శ్రీవాస్తవ ఆరోపించారు.
Recommended Video

తనను కూడా అరెస్టు చేయకుండా ఉండటం కోసం రాజ్ కుంద్రా తరహాలో లంచం ఇవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేశారని, ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని కోరారని ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి నెలలో అరవింద శ్రీవాస్తవ చేసిన ఫిర్యాదును ఏప్రిల్‌లో ముంబై పోలీసు చీఫ్ కార్యాలయానికి పంపింది. అయితే నగర అధికారులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.అమెరికాకు చెందిన ప్లిజ్ మూవీ సంస్థకు సీఈవోగా ఉన్న అరవింద శ్రీవాస్తవ కూడా ఈ రాకెట్ లో ఉన్న కారణంగా ఆయనపై కూడా కేసు నమోదు అయింది. ఇక ఏసీబీకి చేసిన ఈమెయిల్‌లో రాజ్ కుంద్రా లంచం ఇచ్చిన వ్యవహారంతో పాటు అనేక విషయాలపై సుదీర్ఘ లేఖ రాసినట్లుగా సమాచారం. ఇక ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications