ఫేస్‌బుక్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌నంటూ ఫోజు: మోసాలకు పాల్పడిన మహిళ అరెస్ట్
జైపూర్: ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు నెలపాటు శ్రమించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన ఓ 26ఏళ్ల మహిళ తాను ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ వివిధ మోసాలకు పాల్పడుతోంది. ఖుష్బు, స్మృతి శర్మ, లేడీ కోకొవా తదితర పేర్లతో వివిధ రకాల అడ్రస్‌లతో చాలామందిన మోసం చేయడమే గాకుండా, పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెట్టింది.

ఈమెను పట్టుకోవడానికి పోలీసులు నెలన్నరపాటు గాలింపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు అజ్మీర్ రోడ్డులో కారు దొంగిలించి పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఆమెకు సంబంధించిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను అధికారులు బ్లాక్ చేశారు.
కొత్తవారిని స్నేహితులుగా చేసుకోవడం, వారిని టీకి ఆహ్వానించి, వారి దగ్గర్నుంచి విలువైన వస్తువులు, డబ్బు లాక్కోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఎవరైనా ఎదురుతిరిగితే అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానంటూ బెదిరించేది. ఆమె దాదాపు వందమందికిపైగా మోసం చేసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications